Breaking News

పేటీఎమ్‌కు సెబీ ఝలక్‌ 

Published on Wed, 07/17/2024 - 12:16

న్యూఢిల్లీ: పాలనా సంబంధ నిబంధనలు ఉల్లంఘించినట్లు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి వన్‌97 కమ్యూనికేషన్స్‌ తాజాగా హెచ్చరికల లేఖను అందుకుంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఆడిట్‌ కమిటీ లేదా వాటాదారుల అనుమతి లేకుండానే సహచర సంస్థ పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్స్‌(పీపీబీఎల్‌)తో సంబంధిత పార్టీ లావాదేవీ(ఆర్‌పీటీ)లను నిర్వహించినట్లు లేఖలో సెబీ పేర్కొంది. అయితే సెబీ నిబంధనలను స్థిరంగా అమలు చేస్తున్నట్లు బీఎస్‌ఈకి దాఖలు వివరాలలో పేటీఎమ్‌ తెలియజేసింది. నిబంధనల అమలులో కంపెనీ అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నట్లు తెలియజేసింది. 

అంతేకాకుండా సెబీకి వివరణను సైతం సమర్పించనున్నట్లు పేటీఎమ్‌ బ్రాండ్‌ డిజిటల్‌ చెల్లింపుల కంపెనీ వెల్లడించింది. కాగా, సెబీ లేఖ ప్రకారం పీపీబీఎల్, వన్‌97 కమ్యూనికేషన్స్‌ సంబంధ ఫైనాన్షియల్‌ తదితర సమాచారంపై సెబీ పరిశీలన చేపట్టింది. దీనిలో నిబంధనలు పాటించని అంశం గుర్తించింది. ఆడిట్‌ కమిటీ లేదా వాటాదారుల అనుమతి లేకుండానే ఆర్‌పీటీలలో పేటీఎమ్‌ లేదా అనుబంధ సంస్థలు పీపీబీఎల్‌తో అధిక లావాదేవీలు చేపట్టినట్లు సెబీ పేర్కొన్నట్లు వన్‌97 బీఎస్‌ఈకి తెలియజేసింది.  

#

Tags : 1

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)