Breaking News

భారీగా షేర్లు అమ్మేసిన పేటీఎమ్‌

Published on Thu, 08/20/2026 - 21:06

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల దిగ్గజం ‘పేటీఎమ్‌’ మాతృ సంస్థ ‘వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌’లో విదేశీ, దేశీయ ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు భారీగా వాటాలను కొనుగోలు చేశాయి. గోల్డ్‌మెన్‌ శాక్స్, బీఎన్‌పీ పారిబాస్, సొసైటీ జెనరల్‌ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు పలు భారతీయ మ్యూచువల్‌ ఫండ్‌ దిగ్గజాలు ఓపెన్‌ మార్కెట్‌ ‘బ్లాక్‌ డీల్‌’ ద్వారా సుమారు రూ.2,949 కోట్ల విలువైన 3 శాతం వాటాను సొంతం చేసుకున్నాయి. 

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌  (ఎన్‌ఎస్‌ఈ) బ్లాక్‌ డీల్‌ సమాచారం ప్రకారం.. ఈ సంస్థలు సగటున ఒక్కో షేరుకు రూ.1,535.10 చొప్పున మొత్తం 1,92,10,110 ఈక్విటీ షేర్లను (3% వాటాకు సమానం) కొనుగోలు చేశాయి. పేటీఎమ్‌ వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మకు చెందిన ‘రెసిలెంట్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌’ ఈ 3% వాటాను విక్రయించింది.  

వాటా కొనుగోలు చేసిన ప్రధాన సంస్థలు:  
కొనుగోళ్లు చేసిన విదేశీ పోర్ట్‌ఫోలియో సంస్థలో గోల్డ్‌మెన్‌ శాక్స్, బీఎన్‌పీ పారిబాస్, సొసైటీ జెనరల్, ఘిసాల్లో క్యాపిటల్, ఆక్స్‌బో క్యాపిటల్, నార్త్‌ రాక్‌ క్యాపిటల్, విరిడియన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్, విక్టోరియా ఫండ్‌–ఓసీ, ఇంటెగ్రేటెడ్‌ కోర్‌ స్ట్రాటజీస్‌ (ఆసియా) ఉన్నాయి. అలాగే ఎస్‌బీఐ ఎంఎఫ్, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఎంఎఫ్, హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్, కొటక్‌ మహీంద్రా ఎంఎఫ్, హెచ్‌ఎస్‌బీసీ ఎంఎఫ్, సుందరం ఎంఎఫ్, టాటా ఎంఎఫ్‌ తదితర దేశీయ మ్యూచువల్‌ ఫండ్లున్నాయి. వీటితో పాటు బీమా రంగానికి చెందిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్, టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలున్నాయి.

Videos

ఏపీ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి

Watch Live: హైదరాబాద్ లో జగన్ జనసంద్రం

భారత సైన్యం దెబ్బ.. మంచు కొండల్లో చైనాకు దిమ్మతిరిగే షాక్!

ఇది సార్ మా బ్రాండ్.. రాకాలో హాలీవుడ్ నటుడు..?

ఐయామ్ Gen-Z అంటూ ఆర్మీ పై రెచ్చిపోయిన యువతీ

బాబు కొత్త కుట్రలు.. YS అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు

టీడీపీ కార్యకర్త కీచకత్వం.. 8 ఏళ్ల బాలికకు వేధింపులు

TDP నేతకు బిగ్ షాక్

బాబు ఇంట్లో డైనింగ్ టేబుళ్లు పగిలిపోతాయి... నువ్వు ఎవడివి నాపై CBI వేయడానికి..!

YS అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు..

Photos

+5

‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్‌...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా?

+5

నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు)

+5

‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : హైటెక్స్‌లో హిమ్‌టెక్స్‌ ప్రదర్శన (ఫొటోలు)

+5

స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు)

+5

చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు)

+5

చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు)

+5

విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్‌లో విపరీతమైన రద్దీ (ఫొటోలు)

+5

నటి మాళవిక శర్మ గ్లామర్ ఫోటోలు వైరల్

+5

'అమీర్ లోగ్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)