Breaking News

ఫిబ్రవరి తర్వాత కూడా యథావిధిగా పేటీఎం సేవలు

Published on Sat, 02/03/2024 - 06:17

న్యూఢిల్లీ: పేటీఎం సేవలు ఈ నెల (ఫిబ్రవరి) 29 తర్వాత కూడా యథావిధిగానే కొనసాగుతాయని డిజిటల్‌ పేమెంట్స్, సేవల సంస్థ పేటీఎం సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ తెలిపారు. నిబంధనలను పూర్తిగా పాటిస్తూ దేశానికి సేవలందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో శర్మ పోస్ట్‌ చేశారు.

నిబంధనల ఉల్లంఘనలకు గాను పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (పీపీబీఎల్‌) ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లు, టాపప్‌ వంటి పలు సర్వీసులను నిలిపివేయాలంటూ ఆర్‌బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌కి (ఓసీఎల్‌) పీపీబీఎల్‌లో 49% వాటాలు ఉన్నాయి. ఆర్‌బీఐ ఆదేశాల కారణంగా పేటీఎం కార్యకలాపాలపై కూడా ప్రభావం ఉంటుందని అంచనాలు నెలకొన్న నేపథ్యంలో శర్మ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, పేటీఎం సౌండ్‌బాక్స్‌ వంటి సరీ్వసులు అందించే ఆఫ్‌లైన్‌ వ్యాపారులపై ఆర్‌బీఐ ఆదేశాల ప్రభావం ఉండబోదని పేటీఎం తెలిపింది. తమ ప్లాట్‌ఫాంపై కొత్త వ్యాపారులను చేర్చుకునే ప్రక్రియ య«థావిధిగా కొనసాగుతుందని పేర్కొంది.

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు