Breaking News

వాట్సాప్‌లోనే కరెంట్ బిల్, మొబైల్ రీఛార్జ్: కొత్త ఫీచర్ వచ్చేస్తోంది

Published on Sat, 02/08/2025 - 17:24

వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దిగ్గజ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' (Whatsapp) ఎప్పటికప్పుడు అప్డేట్స్ లేదా కొత్త ఫీచర్స్ ప్రవేశపెడుతూనే ఉంది. ఇందులో భాగంగానే మరికొన్ని కొత్త ఫీచర్స్ అందించడానికి సిద్ధమైంది. ఈ ఫీచర్స్ అందుబాటులోకి వస్తే.. వాట్సాప్ నుంచే కరెంట్ బిల్, టెలిఫోన్ బిల్ వంటివన్నీ కట్టేయొచ్చని తెలుస్తోంది.

భారతదేశంలో ఆర్ధిక సేవలను ప్రారంభించడానికి మెటా యోచిస్తోంది. ఇందులో భాగంగానే సంస్థ వాట్సాప్ యాప్‌లోనే కరెంట్ బిల్, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్‌లు, LPG గ్యాస్ చెల్లింపులు, నీటి బిల్లులు, ల్యాండ్‌లైన్ పోస్ట్‌పెయిడ్ బిల్లులు, అద్దె చెల్లింపులు చేయడానికి వీలుగా తగిన ఫీచర్స్ ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా దశలో ఉన్నట్లు సమాచారం. కాబట్టి కొంతమంది యూజర్లు మాత్రమే ఈ ఫీచర్ ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్స్ అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని మెటా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత బిల్స్ చెల్లించడానికి ఇతర యాప్స్ మీద ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. కాబట్టి మీ స్మార్ట్‌ఫోన్‌లో  స్టోరేజ్ సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించే చాలామంది.. ఇన్​స్టెంట్​ మెసేజింగ్ కోసం వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. అయితే వీరందరూ పేమెంట్స్ లేదా బిల్లింగ్స్ కోసం ఇతర యాప్స్ మీద ఆధారపడుతున్నారు. అయితే వాట్సాప్‌లో బిల్స్ చెల్లించడానికి కావలసిన ఫీచర్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత.. ప్రత్యేకించి బిల్స్ పే చేయడానికి ఉపయోగించే యాప్స్ అనవసరం అవుతాయి. కొత్త ఫీచర్స్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉంది. వినియోగంలోకి రావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంటుందని సమాచారం.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)