Breaking News

టెలిగ్రామ్‌ను నిషేధిస్తారా..? సీఈఓ అరెస్టు!

Published on Mon, 08/26/2024 - 15:02

ప్రముఖ ఆన్‌లైన్‌ మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌ను ప్రాన్స్‌ నిషేధిస్తుందనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి. సం‍స్థ సీఈఓ పావెల్ దురోవ్‌(39)ను పారిస్‌లోని లే బోర్గెట్ విమానాశ్రయంలో ఇటీవల అరెస్టు చేశారు. టెలిగ్రామ్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి గతంలో ఫ్రెంచ్ అధికారులు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తాజాగా తనను అరెస్టు చేయడంతో ఒకవేళ ఆరోపణలు రుజువైతే స్థానికంగా ప్రాన్స్‌లో ఈ యాప్‌ను నిషేధిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లల లైంగిక వేధింపులు, హింసను ప్రేరేపించే కంటెంట్‌ టెలిగ్రామ్‌లో వ్యాపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కానీ ఆ సమాచారం నియంత్రణకు ప్లాట్‌ఫామ్‌లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి. దాంతో సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దురోవ్‌ నియంత్రిత కంటెంట్‌ నిర్వహణలో విఫలమయ్యారని పారిస్‌ అధికారులు తెలిపారు. అయితే టెలిగ్రామ్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం సంస్థ అనుసరిస్తున్న నియంత్రణ పద్ధతులు సమర్థంగా ఉన్నాయని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: పేరుకుపోతున్న ప్యాసింజర్‌ కార్లు!

ఈ వ్యవహారంపై రష్యా రాయబార కార్యాలయం స్పందిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్న దురోవ్‌ను సంప్రదించాలంటే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందడం లేదని తెలిపింది. ఇదిలాఉండగా, రష్యా, ఉక్రెయిన్‌తోపాటు గతంలోని సోవియట్‌ కూటమిలో భాగంగా ఉన్న దేశాల్లో ఈ యాప్‌ ప్రజాదరణ పొందింది. అయితే యూజర్ డేటాను పంచుకోవడానికి దురోవ్ నిరాకరించడంతో 2018లో రష్యా ప్రభుత్వం ఈ యాప్‌ను నిషేధించింది. ఈ నిషేధం 2021లో ముగిసింది.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు