Breaking News

విదేశాలకు 6.62 లక్షల కార్లు

Published on Tue, 04/18/2023 - 04:59

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశం నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 6,62,891 యూనిట్ల ప్యాసింజర్‌ వాహనాలు ఎగుమతి అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (సియామ్‌) ప్రకారం.. ప్యాసింజర్‌ కార్లు 10 శాతం వృద్ధితో 4,13,787 యూనిట్లు, యుటిలిటీ వాహనాలు 23 శాతం ఎగసి 2,47,493 యూనిట్లకు చేరుకున్నాయి.

వ్యాన్ల ఎగుమతులు 1,853 నుంచి 1,611 యూనిట్లకు వచ్చి చేరాయి. ప్యాసింజర్‌ వాహన ఎగుమతుల్లో మారుతీ సుజుకీ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. 2021–22తో పోలిస్తే ఈ కంపెనీ 8 శాతం అధికంగా 2,55,439 యూనిట్లను విదేశాలకు సరఫరా చేసింది. హ్యుండై మోటార్‌ ఇండియా నుంచి 18 శాతం ఎక్కువగా 1,53,019 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. కియా ఎగుమతులు 50,864 నుంచి 85,756 యూనిట్లకు ఎగశాయి.

నిస్సాన్‌ మోటార్‌ ఇండియా 60,637 యూనిట్లు, రెనో ఇండియా 34,956, ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా 27,137, హోండా కార్స్‌ ఇండియా 22,710, మహీంద్రా అండ్‌ మహీంద్రా 10,622 యూనిట్లను విదేశాలకు సరఫరా చేశాయి. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం వాహన ఎగుమతులు 2022–23లో 47,61,487 యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 15 శాతం తగ్గుదల.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)