Breaking News

ఈ కంపెనీ ఫ్రిజ్‌లు, వాషింగ్‌మెషీన్లు ఇక ఉండవ్‌..

Published on Sun, 06/29/2025 - 15:59

జపాన్‌కు చెందిన ప్రముఖ అప్లయెన్సెస్ అండ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ పానాసోనిక్ నుంచి  ఫ్రిజ్‌లు, వాషింగ్‌మెషీన్లు ఇక రావు. వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా భారతదేశంలోని రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ విభాగాల నుండి పానాసోనిక్ నిష్క్రమించింది. ఈ సెగ్మెంట్లు రెండూ భారత్‌లో పానాసోనిక్‌కు నష్టాల్లో ఉన్న వ్యాపారాలు. ఇక్కడ మార్కెట్లో స్థానం సంపాదించడానికి కష్టపడుతున్నాయి.

మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ జీఎఫ్‌కే గణాంకాల ప్రకారం.. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్‌ విభాగాలలో పానాసోనిక్ చాలా తక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉంది. వాషింగ్ మెషీన్లలో దీని వాటా 1.8 శాతం, రిఫ్రిజిరేటర్లలో 0.8 శాతంగా ఉంది. ఈ రెండు సెగ్మెంట్లలో పానాసోనిక్ గత ఆరేళ్లుగా అమ్మకాల్లో నష్టాలను చవిచూస్తోంది.

రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ విభాగాల నుండి నిష్క్రమిస్తున్నప్పటికీ డీలర్ల వద్ద ఇప్పటికే ఉన్న ఆయా ఉపకరణాల అమ్మకాలకు సహకరిస్తామని, విడిభాగాలు, వారంటీ కవరేజీతో సహా పూర్తి కస్టమర్ సేవను అందిస్తూనే ఉంటామని పానాసోనిక్ తెలిపింది.

స్తబ్దత నుంచి బయటపడేందుకు, భవిష్యత్తులో బలమైన, పునరుద్ధరించిన వృద్ధి కోసం పానాసోనిక్ గ్రూప్‌ను నిలబెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న వ్యాపారాల నుంచి నిష్క్రమించాలని యోచిస్తున్నట్లు ఈ ఏడాది మేలో పానాసోనిక్ గ్రూప్ సీఈఓ యుకీ కుసుమి తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో పానాసోనిక్ ఇండియా ఆదాయం సుమారు రూ .11,500 కోట్లు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)