Breaking News

వ్యాపార ‘పద్మా’లు..

Published on Tue, 04/29/2025 - 08:27

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం ప్రతిష్టాత్మక ‘పద్మ’ పురస్కారాల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌ ఛైర్మన్‌ పంకజ్‌ పటేల్‌ పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. పద్మశ్రీ గ్రహీతల్లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ ఛైర్‌పర్సన్‌ అరుంధతి భట్టాచార్య, పారిశ్రామికవేత్త పవన్‌ కుమార్‌ గోయెంకా ఉన్నారు. సుజుకీ మోటర్‌ మాజీ చీఫ్, దివంగత ఒసాము సుజుకీకి (మరణానంతరం) ప్రకటించిన పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని సుజుకీ మోటర్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్‌ తొషిహిరో సుజుకీ అందుకున్నారు.

పంకజ్ పటేల్

పంకజ్ పటేల్ దేశంలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన జైడస్ లైఫ్ సైన్సెస్ ఛైర్మన్. 1953 మార్చి 16న గుజరాత్‌లో జన్మించిన ఆయన హెల్త్ కేర్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన నాయకత్వంలో జైడస్ అధిక కొలెస్ట్రాల్ కలిగిన మధుమేహ వ్యాధిగ్రస్తులకు తొలి భారతీయ ఔషధం లిపాగ్లిన్, దేశంలో మొట్టమొదటి హెచ్ 1 ఎన్ 1 వ్యాక్సిన్ వాక్సిఫ్లూ-ఎస్ వంటి ఉత్పత్తులను అభివృద్ధి చేసింది.

అరుంధతీ భట్టాచార్య

ప్రముఖ భారతీయ బ్యాంకర్, కార్పొరేట్ లీడర్‌గా గుర్తింపు పొందారు. 2013 నుంచి 2017 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన తొలి మహిళ. ఆమె తన పదవీకాలంలో మహిళా ఉద్యోగులకు విశ్రాంతి సెలవులు, సంస్థలో మహిళలకు ఉచిత గర్భాశయ క్యాన్సర్ టీకాలు వంటి విధానాలను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం సేల్స్‌ఫోర్స్‌ ఇండియా ఛైర్‌పర్సన్‌, సీఈఓగా ఉన్నారు. గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో సహా పలు బోర్డుల్లో పనిచేశారు.

పవన్ కుమార్ గోయెంకా

ఆటోమోటివ్ రంగంలో సేవలందిస్తున్న ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త. మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీ వంటి ఐకానిక్ వాహనాల అభివృద్ధికి కృషి చేశారు. మహీంద్రా అండ్ మహీంద్రాను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. 2021లో పదవీ విరమణ చేసే వరకు మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఐఎన్-స్పేస్‌) ఛైర్మన్‌గా ఉన్నారు.

ఇదీ చదవండి: భారత్‌లో తగ్గిన పేదరికం! ఎలాగంటే..

ఒసాము సుజుకి 

ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమలో సేవలించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. సుజుకి మోటార్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, సీఈఓగా పని చేశారు. భారత కార్ల మార్కెట్లో మారుతి సుజుకి ద్వారా విప్లవాత్మకమైన పాత్ర పోషించారు. ఇది దేశంలో సరసమైన, నమ్మదగిన వాహనాలకు గుర్తింపుగా మారింది. కంపెనీలో తన నాయకత్వం 1978 నుంచి 2021 వరకు నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగింది. 1930 జనవరి 30న జపాన్‌లో జన్మించిన ఒసాము సుజుకీ 1958లో సుజుకి మోటార్ కార్పొరేషన్‌లో చేరారు. 2024 డిసెంబర్ 25న తన 94వ ఏట కన్నుమూశారు.


 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)