అల్లు అర్జున్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ..?
Breaking News
ఐపీవోకు ఓయో
Published on Thu, 01/01/2026 - 04:18
న్యూఢిల్లీ: గ్లోబల్ ట్రావెల్ టెక్ సంస్థ ప్రిజమ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. ప్రైమరీ మార్కెట్లో ఇటీవల కనిపిస్తున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఓయో బ్రాండ్ కంపెనీ సైతం గోప్యతా విధానంలో ప్రాస్పెక్టస్ సమరి్పంచింది. ఐపీవో ద్వారా రూ. 6,650 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో 7–8(సుమారు రూ. 72,000 కోట్లు) బిలియన్ డాలర్ల విలువను ఆశిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
2025 డిసెంబర్ 20న నిర్వహించిన అసాధారణ సమావేశం(ఈజీఎం)లో కొత్తగా ఈక్విటీ జారీ ద్వారా రూ. 6,650 కోట్లు సమీకరించేందుకు వాటాదారుల నుంచి అనుమతి పొందిన విషయం విదితమే. కంపెనీ ఇంతక్రితం 2021లో తొలుత రూ. 8,430 కోట్ల సమీకరణ కోసం సెబీకి దరఖాస్తు చేసింది. తదుపరి 2023లో తాజా ఫైనాన్షియల్, నిర్వహణ సంబంధ సమాచారంతో ఫైలింగ్ చేసినప్పటికీ అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల కారణంగా ఐపీవో యోచనను విరమించుకుంది. 2012లో రితేష్ అగర్వాల్ ఏర్పాటు చేసిన కంపెనీలో పీఈ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ అతిపెద్ద వాటాదారుగా ఉంది.
Tags : 1