Breaking News

కొత్త పన్ను విధానంలోకి ఇక భారీగా..!

Published on Mon, 02/03/2025 - 06:29

న్యూఢిల్లీ: తాజా బడ్జెట్‌లో తెరతీసిన ఆదాయ పన్ను భారీ రిబేట్లు కారణంగా కొత్త విధానంలోకి మరింత మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు చేరతారని ప్రభుత్వం భావిస్తోంది. 90 శాతానికిపైగా పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్ని ఎంపిక చేసుకోనున్నట్లు కేంద్ర  ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) చైర్మన్‌ రవి అగర్వాల్‌ ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 75 శాతంమంది కొత్త విధానంలో ఉన్నారు. ఆర్థిక మంత్రి సీతారామన్‌ రూ. 12 లక్షల వరకూ ఆదాయంపై పన్ను లేకుండా ప్రతిపాదించడంతో పలువురు కొత్త విధానంలోని మారనున్నట్లు తెలియజేశారు. పన్ను శ్లాబుల పునర్వ్యవస్థీకరణ సైతం ఇందుకు సహకరించనున్నట్లు పేర్కొన్నారు. 

ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) వినియోగాన్ని మరింత పెంచడం ద్వారా మానవ జోక్యం లేని పన్నుల నిర్వహణకు ప్రభుత్వం, ఆదాయ పన్ను శాఖలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఆదాయాన్ని ప్రకటించడంలో సాధారణ పన్ను చెల్లింపుదారులకు సులభమైన పద్ధతులను అందుబాటులోకి తీసుకువచి్చనట్లు తెలియజేశారు. ఇందుకు ప్రవేశపెట్టిన సరళతర ఐటీఆర్‌–1, ముందస్తుగా నమోదయ్యే ఐటీ రిటర్నులు, మూలంవద్ద పన్ను(టీడీఎస్‌)లో ఆటోమాటిక్‌ మదింపు తదితరాలను ప్రస్తావించారు. మినహాయింపులు, తగ్గింపులవంటివి లేని నూతన పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు మదింపు మరింత సులభమవుతుందని పేర్కొన్నారు. వెరసి ఐటీ నిపుణుల అవసరంలేకుండానే ఐటీఆర్‌ను దాఖలు చేయవచ్చని తెలియజేశారు.

 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)