Breaking News

పండుగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ జోరు: రెండు రోజుల్లో 33 కోట్లు..

Published on Sat, 09/28/2024 - 21:25

భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలు ఫెస్టివల్ సేల్స్ ప్రారభించేసాయి. ఈ తరుణంలో స్వదేశీ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వీఐపీ, కస్టమర్‌ల కోసం 2024 సెప్టెంబర్ 26 నుంచి ముందస్తు యాక్సెస్‌తో 2024 బిగ్ బిలియన్ డేస్ 11వ ఎడిషన్‌ను సెప్టెంబర్ 27న ప్రారంభించింది.

2024 బిగ్ బిలియన్ డేస్ ప్రారంభమైన (యాక్సెస్ ప్రారంభించిన రోజు, మొదటి రోజు) సెప్టెంబర్ 26, 27వ తేదీల్లో ఫ్లిప్‌కార్ట్‌ను ఏకంగా 33కోట్ల మంది సందర్శించారు. దీన్ని బట్టి చూస్తే భారతదేశంలో పండుగ ఉత్సాహం ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతోంది.

పండుగ సీజన్‌లో ప్రారంభమైన బిగ్ బిలియన్ డేస్ రోజు.. ఎక్కువగా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, లార్జ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ ప్రొడక్ట్స్ వంటి వాటిని ఎక్కువగా సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు వంటి అగ్ర మెట్రో నగర వాసులు మొదటి 24 గంటల్లో ఎక్కువగా ఫ్లిప్‌కార్ట్‌ను సందర్శించారు. మొత్తం మీద మొదటిరోజు బిగ్ బిలియన్ డేస్ ప్రారంభ యాక్సెస్, 1వ రోజులో అధిక డిమాండ్‌ను చూసింది.

కస్టమర్‌లు ఫ్యాషన్, లైఫ్ స్టైల్ వంటి వాటికి సంబంధించిన సరికొత్త ఆఫర్‌లను గురించి కూడా ఎక్కుగా సెర్చ్ చేసారు. ట్రెండింగ్ ఉత్పత్తులను కూడా ఆసక్తి చూపినట్లు సమాచారం. జనరేషన్ జెడ్ ప్రేక్షకులు బ్యాగీ బాటమ్స్, జీన్స్, బ్లాక్ ప్రింట్ కుర్తాలు, డెమూర్ డ్రెస్‌లు, రెట్రో రన్నర్స్, యుటిలిటీ కార్గోస్, మల్టీ పాకెట్డ్ షర్ట్స్, కో-ఆర్డ్ సెట్‌, జపనీస్ స్టైల్ టీ-షర్టులు సెర్చ్ చేశారు.

ఇదీ చదవండి: దేశంలోనే పెద్ద కరెన్సీ నోటు.. ఎందుకు రద్దు చేశారంటే?

ప్రీ-ఫెస్టివ్ సీజన్‌తో పోల్చితే.. ఈ సీజన్‌లో కస్టమర్లు 70 శాతం ఎక్కువ సందర్శించినట్లు తెలిసింది. లైఫ్ స్టైల్, హోమ్ & కిచెన్ వంటివి రెండు రెట్లు, బ్యూటీ పర్సనల్ కేర్ వంటివి మూడురెట్లు వృద్ధిని సాధించింది. మొత్తం మీద లావాదేవీలు 2.8 రెట్లు పెరిగింది. బిగ్ బిలియన్ డేస్ ప్రారంభమైన మొదటి 12 గంటల్లో అత్యధికంగా ఎలక్ట్రానిక్స్ ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టాబ్లెట్‌లు, డెస్క్‌టాప్ వంటివి అమ్ముడయ్యాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)