Breaking News

2,600లకు పైగా విమానాలు రద్దు.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ విజ్ఞప్తులు

Published on Mon, 07/17/2023 - 18:30

అమెరికాలో భారీ వర్షాలు, పిడుగుల కారణంగా ఆదివారం(జులై 16) 2,600లకు పైగా విమానాలు రద్దయ్యాయి. సుమారు 8 వేల విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఈ మేరకు ఏబీసీ న్యూస్‌ వార్తా సంస్థ పేర్కొంది. ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ) ప్రకారం అత్యధికంగా ఈశాన్య ప్రాంతంలోనే రద్దయ్యాయి. 

ఒక్క న్యూజెర్సీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే 350 కిపైగా విమానాలు రద్దయినట్లు ఎన్‌బీసీ న్యూస్‌ నివేదించింది. తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా న్యూయార్క్‌లోని జాన్‌ ఎఫ్‌ కెన్నడీ ఎయిర్‌పోర్ట్‌, లా గార్డియన్‌ విమానాశ్రయాలు కూడా స్తంభించినట్లు పేర్కొంది. 

ఇదీ చదవండి ➤ ఆకాశంలో ఉండగా.. ఎయిరిండియా విమానంలో కలకలం

ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే ముందే ఫ్లయిట్‌ టైమింగ్‌, వాతావరణ పరిస్థితులను సరిచూసుకోవాలని ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ప్రయాణికులకు ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తులు చేశాయి.

కాగా ఆ దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. న్యూయార్క్‌, న్యూజెర్సీ, కనెక్టికట్‌, పెన్సిల్వేనియా, మసాచుసెట్స్‌, వెర్మాంట్‌ ప్రాంతాల్లో వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రాణాంతక వరదలు సైతం నమోదైనట్లు నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌ పేర్కొంది.

ఇది ఇలా ఉంటే, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల కారణంగా ఆ దేశంలోని కొన్ని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో వడ గాల్పుల హెచ్చరికలు జారీ చేశారు. నైరుతి, పశ్చిమ గల్ఫ్ కోస్ట్, దక్షిణ ఫ్లోరిడాలోని కొన్ని ప్రాంతాలలో తీవ్ర ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. రాబోయే వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్‌డబ్ల్యూఎస్‌ హెచ్చరించింది.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు