Breaking News

కోటి మొబైల్ కనెక్షన్‌లు డిస్‌కనెక్ట్

Published on Thu, 09/12/2024 - 08:35

ఇబ్బందికరమైన కాలర్లు, మోసాలకు పాల్పడుతున్న మొబైల్‌ కనెక్షన్‌లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్, టెలికాం డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా ఇలాంటి కోటికిపైగా మొబైల్ కనెక్షన్‌లను డిస్‌కనెక్ట్ చేసినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించాయి. అలాగే సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాలకు పాల్పడినందుకు 2.27 లక్షల మొబైల్ హ్యాండ్‌సెట్‌లను టెలికాం శాఖ బ్లాక్ చేసింది.

"ఇప్పటి వరకు, సంచారసాథి సహాయంతో 1 కోటికి పైగా మోసపూరిత మొబైల్ కనెక్షన్‌లు డిస్‌కనెక్ట్ చేశాం. అలాగే సైబర్ క్రైమ్/ఆర్థిక మోసాలకు పాల్పడినందుకు 2.27 లక్షల మొబైల్ హ్యాండ్‌సెట్‌లు బ్లాక్ చేశాం" అని ప్రకటన పేర్కొంది. స్పామ్ కాల్స్‌ కోసం రోబోకాల్స్‌, ప్రీ-రికార్డ్ కాల్స్‌తో సహా బల్క్ కనెక్షన్‌లను ఉపయోగిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని టెలికాం ఆపరేటర్లను ట్రాయ్‌ ఆదేశించింది.వాటి కనెక్షన్‌లను డిస్‌కనెక్ట్ చేసి బ్లాక్‌లిస్ట్ చేయాలని సూచించింది.

ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ కోసం 5జీ ఫోన్‌ కొనాలా?

"గడిచిన 15 రోజుల్లో అటువంటి 3.5 లక్షల నంబర్‌లు డిస్‌కనెక్ట్ చేశాం. 50 సంస్థలను బ్లాక్‌లిస్ట్ చేశాం. అలాగే దాదాపు 3.5 లక్షల ఉపయోగించని, ధ్రువీకరించని ఎస్‌ఎంఎస్‌ హెడర్‌లు, 12 లక్షల కంటెంట్ టెంప్లేట్‌లను బ్లాక్ చేశాం" అని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చర్యలతో పాటు నాణ్యతా సేవా నిబంధనలను ట్రాయ్‌ సవరించింది. ఇవి అక్టోబర్ 1 నుండి అమలులోకి రానున్నాయి. ఏప్రిల్ 1 నుండి మొబైల్ సర్వీస్‌ క్యూఓఎస్‌ పనితీరు సమీక్ష త్రైమాసిక ప్రాతిపదికన కాకుండా నెలవారీగా నిర్వహించనున్నట్లు కూడా ప్రకటనలో వెల్లడించారు.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)