Breaking News

ఆభరణాల మార్కెట్లో సంఘటిత రంగం పట్టు!

Published on Mon, 05/29/2023 - 04:26

ముంబై: ఆభరణాల మార్కెట్లో సంఘటిత రంగం వాటా ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12–15 శాతం మేర పెరగొచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. పెద్ద సంస్థలన్నీ విస్తరణ ప్రణాళికలతో ముందుకు వెళుతున్న విషయాన్ని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా గుర్తు చేసింది. దీంతో స్థూల ఆర్థిక సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ సంఘటిత రంగం వాటా పెంచుకోగలదని ఇక్రా అంచనా వేస్తోంది. ఆభరణాల మార్కెట్‌ 2023–24లో విలువ పరంగా 8–10 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని తెలిపింది. బంగారం ధరల్లో అస్థిరతల నేపథ్యంలో పరిమాణాత్మకంగా మార్కెట్‌లో పెద్ద వృద్ధి నమోదు కాకపోవచ్చన్న అంచనాతో ఉంది.

కాకపోతే బంగారానికి ఉన్న బలమైన సాంస్కృతిక అనుబంధం నేపథ్యంలో పండుగలు, వివాహాల సందర్భంగా బంగారం ఆభరణాలకు డిమాండ్‌ మద్దతుగా నిలుస్తుందని వివరించింది. ‘‘చాలా మంది జ్యుయలరీ రిటైలర్లు 2023 అక్షయ తృతీయ సందర్భంగా ఆదాయంలో 15 శాతానికి పైగా వృద్ధిని చూసినట్టు పేర్కొన్నారు. బంగారం ధరలు పెరగడం, ఎక్కువ సంస్థలు దూకుడుగా రిటైల్‌ స్టోర్లను పెంచడం ఆదాయ వృద్ధికి మద్దతునిస్తుంది’’అని ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌ కౌశిక్‌ దాస్‌ పేర్కొన్నారు. జ్యుయలర్ల ఆపరేటింగ్‌ మార్జిన్‌ సౌకర్య స్థాయిలో 7.5–8 శాతం మేర వచ్చే రెండేళ్లు ఉంటుందని ఇక్రా అంచనా వేసింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)