టాప్‌ కంపెనీలో 2,800 ఉద్యోగాలు కట్‌

Published on Wed, 08/20/2025 - 12:20

కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులను వేగవంతం చేయడానికి ఉద్దేశించిన పునర్నిర్మాణ వ్యూహంలో భాగంగా ఒరాకిల్ కార్పొరేషన్ భారతదేశంలోని శ్రామిక శక్తిని తగ్గిస్తుంది. దేశంలోని కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 10% మందిని తొలగించాలని నిర్ణయించింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పుణె, నోయిడా, కోల్‌కతా వంటి కీలక ప్రాంత్రాల్లో సుమారు 28,824 మంది ఉద్యోగులు ఒరాకిల్‌లో పని చేస్తున్నారు. వీరిపై ‍ప్రభావంపడే అవకాశం ఉంది.

కంపెనీ ప్రకటించిన లేఆఫ్స్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, క్లౌడ్ సేవలు, కస్టమర్ బేస్‌పై నిమగ్నమైన బృందాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొన్ని క్యాంపస్‌ల్లో ఈ తొలగింపులు ఆకస్మికంగా ఉన్నాయని, తొలగింపు ప్యాకేజీలు లేదా అంతర్గత పునర్విభజన ఎంపికల ఊసే లేదని చెబుతున్నారు. యాజమాన్యం నుంచి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఊహించని విధంగా నోటీసులు రావడంతో ఆందోళన చెందుతున్నారు. పునర్నిర్మాణ వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒరాకిల్ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.

ఇదీ చదవండి: ఈ-కామర్స్, టెక్‌ స్టార్టప్‌ల్లో ఫ్రెషర్లకు అవకాశాలు

గత నెలలో అమెరికాలో 4.5 గిగావాట్ల డేటా సెంటర్ పవర్‌ కోసం ఓపెన్ఏఐ ఓరాకిల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒరాకిల్ డేటా సెంటర్ల నుంచి భారీ మొత్తంలో కంప్యూటింగ్ పవర్‌ను అద్దెకు తీసుకునేందుకు ఓపెన్ఏఐ అంగీకరించింది. తర్వాత ఒరాకిల్ స్టాక్ ఆల్‌టైమ్‌ గరిష్టానికి దగ్గరగా చేరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల్లో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ఒరాకిల్ సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ లేఆఫ్స్‌ తరుణంలో ఉద్యోగులు తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకుని, మెరుగైన పనితీరు కనబరచాలని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తు ఏఐపై ఆధారపడబోతోందని స్పష్టమైన సంకేతాలు వస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన స్కిల్స్‌పై ఎక్కువ దృష్టి సారించాలని చెబుతున్నారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)