Breaking News

త్వరలో అందరికీ ఉచితంగా జీపీటీ-4ఓ.. ప్రత్యేకతలివే..

Published on Thu, 05/16/2024 - 09:05

ప్రముఖ టెక్‌ సంస్థ ఓపెన్‌ఏఐ అ‍డ్వాన్స్‌ ఫీచర్లతో కొత్త చాట్‌జీపీటీ వెర్షన్‌(జీపీటీ-4ఓమ్ని)ను విడుదల చేసింది. ఇందులో అత్యాధునిక వాయిస్‌, టెక్ట్స్‌, విజన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయని సంస్థ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మీరామురాటీ తెలిపారు.

ఈ సందర్భంగా మీరా మాట్లాడుతూ..‘జీపీటీ-4 టర్బోతో పోలిస్తే కొత్త వెర్షన్‌ రెండింతలు వేగంగా పనిచేస్తుంది. దీని సబ్‌స్క్రిప్షన్‌ ధర జీపీటీ4 టర్బో కంటే తక్కువగా ఉంటుంది. మరికొన్ని వారాల్లో ఈ వెర్షన్‌ను అందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నాం. అయితే, వారికి కొన్ని పరిమితులుంటాయి. పెయిడ్‌ సబ్‌స్క్రైబర్లకు మాత్రం అవి వర్తించవు. ఈ కొత్త మోడల్‌ దాదాపు 50 భాషలను సపోర్ట్‌ చేస్తుంది. వీటిలో తెలుగు, గుజరాతీ, తమిళం, మరాఠీ, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాళీ వంటి భారతీయ భాషలు ఉన్నాయి. వాయిస్‌ కమాండ్లకు కేవలం 232 మిల్లీ సెకన్లలోనే జీపీటీ-4ఓ సమాధానం ఇస్తుంది. టెక్ట్స్‌, రీజనింగ్‌, కోడింగ్‌ ఇంటెలిజెన్స్‌లో టర్బో వెర్షన్‌ కంటే మెరుగ్గా పనిచేస్తుంది. తర్వలో యాపిల్‌ మ్యాక్‌ఓఎస్‌ యూజర్లకు డెస్క్‌టాప్‌ యాప్‌ను విడుదల చేయనున్నాం. మరికొన్ని రోజుల్లో విండోస్‌ యూజర్లకు కూడా యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 32 వీడియో లింకులను బ్లాక్‌ చేసిన యూట్యూబ్‌!

ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) అనే కృత్రిమ మేధతో చాట్‌జీపీటీను 2015లో సామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రాక్‌మన్, ఇలియా సుట్స్‌కేవర్, వోజ్‌సీచ్ జరెంబా స్థాపించారు. ఓపెన్‌ఏఐలో మైక్రోసాఫ్ట్‌ 2019లో రూ.8,345 కోట్లు పెట్టుబడి పెట్టింది.

#

Tags : 1

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)