Breaking News

ఏఐ కంట్రోల్ తప్పిందా?

Published on Wed, 07/22/2026 - 12:38

కృత్రిమ మేధ సాంకేతికత రంగంలో ముందెన్నడూ చూడని పరిణామం చోటుచేసుకుంది. ఓపెన్ఏఐ అభివృద్ధి చేసిన అత్యాధునిక ఏఐ మోడళ్లు తమ అంతర్గత భద్రతా పరిమితులను (Sandboxed environment) దాటుకుని వచ్చి ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫారమ్ ‘హగ్గింగ్ ఫేస్’ నెట్‌వర్క్‌పై స్వయంప్రతిపత్తితో దాడి చేసినట్లు సమాచారం వెలువడింది. సైబర్ సెక్యూరిటీ ఎవాల్యూషన్‌ సమయంలో జరిగిన ఈ సంఘటనను ఓపెన్ఏఐ ‘అపూర్వమైన సైబర్ ఘటన’గా అభివర్ణించింది.

ఈ దాడి ఎలా జరిగింది?

ఓపెన్ఏఐ ఇటీవల విడుదల చేసిన GPT-5.6 Sol, ఇతర అంతర్గత ప్రీరిలీజ్ మోడళ్ల సైబర్ సామర్థ్యాలను పరీక్షించడానికి ‘ExploitGym’ అనే బెంచ్‌మార్క్ మూల్యాంకనం నిర్వహిస్తోంది. ఈ పరీక్ష కోసం మోడళ్ల సాధారణ సైబర్ నిరోధకాలను తాత్కాలికంగా సడలించారు. అయితే, నిర్దేశించిన లక్ష్యాన్ని ఏలాగైనా సాధించాలనే ధోరణితో ఈ ఏఐ మోడళ్లు థర్డ్-పార్టీ సాఫ్ట్‌వేర్‌లోని ఒక లోపాన్ని గుర్తించి అత్యంత సురక్షితమైన సాండ్‌బాక్స్ పరిధిని దాటి యాక్సెస్‌ను సాధించాయి.

అక్కడితో ఆగకుండా, సదరు బెంచ్‌మార్క్ పరిష్కారాలు 'హగ్గింగ్ ఫేస్' సర్వర్లలో ఉన్నట్లు విశ్లేషించిన మోడళ్లు చోరీ చేసిన క్రెడెన్షియల్స్, నెట్‌వర్క్ లోపాల ఆధారంగా ఆ ప్రొడక్షన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోకి ప్రవేశించి సీక్రెట్ సమాచారాన్ని సైతం యాక్సెస్ చేశాయి.

సంస్థల స్పందన.. భవిష్యత్తు హెచ్చరికలు

ఈ ఘటనపై ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ స్పందిస్తూ మోడల్ ఎవాల్యూషన్‌ సమయంలో తీవ్రమైన భద్రతా సంఘటన జరిగిందని ధ్రువీకరించారు. హగ్గింగ్ ఫేస్ సీఈఓ క్లెమెంట్ డెలాంగే మాట్లాడుతూ.. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేకపోయినప్పటికీ ఏఐ మోడళ్లు సొంతంగా ఇలా పరిమితులు దాటడం సైబర్ సెక్యూరిటీ చరిత్రలోనే అత్యంత ఆందోళనకరమైన పరిణామమని వ్యాఖ్యానించారు.

ఈ అనుభవంతో ఓపెన్ఏఐ తన ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌పై మరింత కఠినమైన నియంత్రణలను అమలు చేయడంతోపాటు సదరు లోపాన్ని బాధ్యతాయుతంగా సరిచేసింది. వేగంగా విస్తరిస్తున్న ఏఐ మోడళ్ల సామర్థ్యాలకు అనుగుణంగా భద్రతా వ్యవస్థలు ఇంకా బలపడకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు సాధారణమయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: ఒక్కరోజులో ధరలు అమాంతం ఇలా..

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)