Breaking News

గణిత ప్రపంచంలో OpenAI సంచలనం!

Published on Thu, 11/26/2026 - 11:43

ప్రతి ఏఐ చాట్‌బాట్‌లు, వాతావరణ అంచనాలు, శాస్త్రీయ పరిశోధనల వెనుక ఎన్నో గణిత లెక్కలు ఉంటాయి. ఇందులో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చాలా కీలకం. ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడం నుంచి భారీ డేటాను విశ్లేషించడం వరకు అనేక పనుల్లో ఇది ఉపయోగపడుతుంది.

అయితే.. ఈ లెక్కలను వీలైనంత తక్కువ సమయంలో, తక్కువ కంప్యూటింగ్ శక్తితో ఎలా చేయాలనే ప్రశ్నపై గణిత శాస్త్రవేత్తలు 50 ఏళ్లకు పైగా పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా.. ఓపెన్‌ఏఐ ఈ విషయంలో కీలక పురోగతి సాధించినట్లు ప్రకటించింది.

ఓపెన్‌ఏఐ అభివృద్ధి చేసిన ఒక ఏఐ మోడల్ సాయంతో.. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్‌కు సంబంధించిన గణిత సమస్యపై కొత్త ఫలితాన్ని సాధించినట్లు పరిశోధకులు వెల్లడించారు. ది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎక్స్‌పోనెంట్‌ ఈస్ నైన్ ఫోర్త్ (The Matrix Multiplication Exponent Is Nine Fourths) పేరుతో ఈ పరిశోధనను ప్రీప్రింట్ రూపంలో ప్రచురించారు. ఇందులో.. మ్యాట్రిక్స్‌ గుణకారానికి అవసరమైన గణన సంక్లిష్టతకు సంబంధించిన పరిమితులను నిర్ధారించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించిన ఎక్స్‌పోనెంట్ విలువను 2.25గా చూపించారు. 1969 నుంచి కొనసాగుతున్న ఈ పరిశోధనలో ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

అసలు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంటే ఏమిటంటే.. సంఖ్యలను వరుసలు, నిలువు వరుసల రూపంలో అమర్చి రూపొందించే పట్టికలను మ్యాట్రిక్స్‌ అంటారు. ఇలాంటి రెండు మ్యాట్రిక్స్‌ను గుణించడాన్నే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంటారు. సాధారణంగా వినడానికి చిన్న గణిత ప్రక్రియలా అనిపించినప్పటికీ.. భారీ స్థాయిలో లెక్కలు చేయాల్సి వచ్చినప్పుడు కంప్యూటర్లకు చాలా సమయం, శక్తి అవసరమవుతుంది. ఈ లెక్కలను మరింత సమర్థవంతంగా చేసే మార్గాలను కనుగొనడమే పరిశోధకుల లక్ష్యం. గతంలో ఓపెన్‌ఏఐ ప్రకటించిన అత్యుత్తమ పరిమితి 2.371177 కాగా, తాజా పరిశోధనలో 2.25 అనే విలువను వెల్లడించింది.

ఇదీ చదవండి: ఒక్కరోజులోనే సీన్ రివర్స్.. పసిడి ధరల్లో కీలక మార్పు!

Videos

5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!

తెలుగు ఇండస్ట్రీపై విషం కక్కిన తాప్సీ

చెప్పులు మాత్రమే కొట్టేసే దొంగ

రెచ్చిపోయిన పరిటాల సునీతా అనుచరులు

నెలకు రూ. 10 వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.55 లక్షలు

తలుపులు వేసుకొని మరీ రిగ్గింగ్ చేస్తున్నారు

YSRCP గోర్ల ఉపేంద్ర రెడ్డి అరెస్ట్ చేయాలనీ చూసిన పోలీసులకు చుక్కలు చూపించిన ప్రజలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

మిస్ యూనివర్స్ గా ఓ తల్లి.. చరిత్ర సృష్టించిన జెన్నిఫర్ !

ఓటు హక్కును వినియోగించుకున్న YS విమలమ్మ

Photos

+5

బ్లాక్‌ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ గ్లామర్.. (ఫోటోలు)

+5

'కూల్ రాకీ కూల్' సినిమా ఈవెంట్‌లో మెరిసిన ‘సౌమ్య జాను’ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నటి మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

ఏపీలో 'అభినవ తిరుపతి'ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘హైదరాబాద్‌ వాక్స్‌ ఫర్‌ నషాముక్త్‌ భారత్‌’ పాదయాత్ర (ఫోటోలు)

+5

అందమైన నవ్వుతో మీనాక్షి ఫొటోలు చూశారా?

+5

దుబాయ్‌లో కాజల్.. చెల్లితో సందడి (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీల్లో మెరిసిన అక్కినేని కోడలు శోభిత.. (ఫోటోలు)

+5

మిస్ యూనివర్స్ పోటీలు... కిరీటాన్ని గెలుచుకున్న జెన్నిఫర్ బారెటో (ఫోటోలు)

+5

భోగి మ్యూజికల్ ఈవెంట్‌లో డింపుల్ హయాతి గ్లామర్.. (ఫోటోలు)