మళ్లీ ఓపెన్‌ మార్కెట్‌లో షేర్ల బైబ్యాక్‌

Published on Sat, 06/20/2026 - 07:44

ముంబై: ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా షేర్ల బైబ్యాక్‌ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది. ఇది ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ తరహా బైబ్యాక్‌లను ప్రకటించిన 66 రోజుల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కేటాయించిన మొత్తంలో కనీసం 40 శాతం నిధులను ప్రథమార్ధంలో వెచి్చంచాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం విడిగా ట్రేడింగ్‌ విండోను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని సెబీ తెలిపింది.

నిబంధనల్లో మార్పుల కారణంగా 2025 ఏప్రిల్‌ 1 నుంచి ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా బైబ్యాక్‌ విధానాన్ని నిలిపివేశారు. సెబీ ప్రతిపాదించిన కొత్త నిబంధనల ప్రకారం ఓపెన్‌ మార్కెట్‌ బైబ్యాక్‌ల గురించిన వివరాలను పత్రికల ద్వారా బహిరంగ ప్రకటనలతో పాటు ఎల్రక్టానిక్‌ పద్ధతిలో షేర్‌హోల్డర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. మర్చంట్‌ బ్యాంకరును నియమించుకోవడమనేది కంపెనీ విచక్షణ మేరకు ఉంటుంది.

పబ్లిక్‌ వాటాదారులు స్టాక్‌ ఎక్స్ఛేం​జీల్లో సాధారణంగా విక్రయించినప్పుడు వర్తించే క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్సే.. ఈ బైబ్యాక్‌లో విక్రయించే షేర్లకు కూడా వర్తిస్తుంది. ఈ వ్యవధిలో ప్రమోటర్లు, వారికి సంబంధమున్న వారి షేర్లను ఫ్రీజ్‌ చేస్తారు. కనీస పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ (ఎంపీఎస్‌) నిబంధనల పరిమితికి మించి బైబ్యాక్‌లను చేపట్టడానికి ఉండదు.  

ఏఐఎఫ్‌లు వేగవంతం .. 
ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (ఏఐఎఫ్‌) మరింత వేగవంతంగా స్కీములను ప్రవేశపెట్టేందుకు వీలుగా కొత్త గ్రీన్‌ చానల్‌ విధానం ’గరుడ’కి సెబీ బోర్డు ఆమోదముద్ర వేసింది. దీనితో మెమొరాండంలను సమరి్పంచిన 10 రోజుల వ్యవధిలోనే ఫండ్స్‌ నిధులను సమీకరించేందుకు వీలుంటుంది. ప్రస్తుతం ఇందుకు 30 రోజుల వెయిటింగ్‌ పీరియడ్‌ ఉంటోంది. నాన్‌–అక్రెడిటెడ్‌ ఇన్వెస్టర్‌ స్కీములు, అక్రెడిటెడ్‌ ఇన్వెస్టర్‌ – ఓన్లీ పథకాలు, ఏంజెల్‌ ఫండ్స్‌ (రెగ్యులర్‌ స్కీములు)కి ఇది వర్తిస్తుంది.

ఏఐ స్కీములు, ఏంజెల్‌ ఫండ్‌లు .. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ మెమొరాండంలను (పీపీఎం) మర్చంట్‌ బ్యాంకర్ల అవసరం లేకుండా ఫండ్‌ మేనేజర్ల ద్వారా నేరుగా సమర్పించవచ్చు. పీపీఎంని సమర్పించాక సమీక్ష వ్యవధి పూర్తయ్యేంత వరకు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా తక్షణమే స్కీములను ప్రారంభించవచ్చు. అటు సోషల్‌ స్టాక్‌ ఎక్సే్చంజీ (ఎస్‌ఎస్‌ఈ)కి సంబంధించిన కెపాసిటీ బిల్డింగ్‌ ఫండ్‌ (సీబీఎఫ్‌) నిధులు, నిర్వహణ బాధ్యతలను నాబార్డ్‌ నుంచి తప్పించి కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌ఈ–సీబీఎఫ్‌కి బదలాయించే ప్రతిపాదనకు సెబీ ఆమోదం 
తెలిపింది.  

రిజిస్టర్డ్‌ ఏఐఎఫ్‌లు 1,849 ..
సెబీ డేటా ప్రకారం అయిదేళ్ల క్రితం రిజిస్టర్డ్‌ ఏఐఎఫ్‌ల సంఖ్య 732గా ఉండగా 2026 మార్చి 31 నాటికి 135 శాతం వృద్ధి చెంది 1,849కి చేరింది. 2025 డిసెంబర్‌ 31 నాటికి స్థూల పెట్టుబడుల ప్రతిపాదనలు రూ. 15.74 లక్షల కోట్లుగా ఉండగా, నికర పెట్టుబడులు రూ. 6.45 లక్షల కోట్లుగా ఉన్నాయి. గతేడాది 649గా ఉన్న అక్రెడిటెడ్‌ ఇన్వెస్టర్ల సంఖ్య 2026 ఏప్రిల్‌ 30 నాటికి 2,773కి ఎగిసింది. 2025 డిసెంబర్‌ 31 నాటికి వీరి చేతుల్లో రూ. 1.91 లక్షల కోట్ల విలువ చేసే ఏఐఎఫ్‌ యూనిట్లు ఉన్నాయి. మొత్తం ఏఐఎఫ్‌ పెట్టుబడుల్లో ఇది సుమారు 30 శాతం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)