Breaking News

ధరలతో చిర్రెత్తిన ఉల్లి, వెల్లుల్లి!

Published on Sat, 11/28/2026 - 16:15

దేశవ్యాప్తంగా సామాన్యుల వంటింటి బడ్జెట్‌పై ధరల భారం మరింత పెరుగుతోంది. కూరగాయల నుంచి పాలు, పాల ఉత్పత్తుల వరకు ధరల పెరుగుదల వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఉల్లిపాయ ధరలు ఏడాది వ్యవధిలో ఏకంగా 116 శాతం పెరగడం, వెల్లుల్లి ధరలు 61 శాతం ఎగబాకడం ఆహార ద్రవ్యోల్బణ తీవ్రతకు అద్దం పడుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నెలవారీ ఆర్థిక సమీక్షలోనూ ఈ ధరల ఒత్తిడిని ప్రస్తావిస్తోంది.

ఉల్లిపాయ, వెల్లుల్లి ధరల దూకుడు

కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2026 అక్టోబర్ వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) గణాంకాల ప్రకారం.. ఉల్లిపాయల వార్షిక ద్రవ్యోల్బణం 116.22 శాతంగా నమోదైంది. సెప్టెంబరులో ఇది 108.13 శాతంగా ఉండగా, అక్టోబరులో మరింత పెరిగింది. వెల్లుల్లి ధరల ద్రవ్యోల్బణం 60.74 శాతానికి చేరింది. అల్లం ధరలు 48.32 శాతం, నిమ్మకాయల ధరలు 47.30 శాతం పెరిగాయి. ఈ గణాంకాలు గత ఏడాది ఇదే నెలతో పోల్చిన ధరల మార్పును సూచిస్తాయి. అంటే ఉల్లిపాయల ధరలు ఏడాది క్రితం స్థాయితో పోలిస్తే రెట్టింపుకుపైగా పెరిగినట్లు తెలుస్తుంది.

పాలు, పాల ఉత్పత్తులూ ఖరీదే..

ఆర్థిక మంత్రిత్వ శాఖ సమీక్షను ఉటంకిస్తూ వచ్చిన కథనాల ప్రకారం.. అక్టోబరులో పాల ధరల ద్రవ్యోల్బణం 4.6 శాతంగా నమోదైంది. పనీర్‌ ధరలు 5.7 శాతం, పెరుగు ధరలు 4.4 శాతం పెరిగాయి. పండుగలు, వివాహాల సీజన్‌ నేపథ్యంలో పాల ఆధారిత మిఠాయిల ధరలు 10 శాతం ఎగిశాయి. చికెన్‌ ధరల ద్రవ్యోల్బణం 11.3 శాతం, మాంసం 10.6 శాతం, చేపలు 8.5 శాతం, గుడ్లు 8.3 శాతంగా నమోదైనట్లు నివేదిక పేర్కొంది.

మొత్తం ఆహార ద్రవ్యోల్బణం 8.94 శాతం

అధికారిక గణాంకాల ప్రకారం.. దేశంలో అక్టోబరు నెలలో మొత్తం రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి చేరింది. సెప్టెంబరులో ఇది 5.54 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం కూడా 7.74 శాతం నుంచి 8.94 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం 9.09 శాతంగా, పట్టణాల్లో 8.68 శాతంగా నమోదైంది.

ధరల ఉపశమనానికి ప్రభుత్వ చర్యలు

ఉల్లిపాయల ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ద్వారా నిల్వలను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. అక్టోబరు 7న కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో కొత్త ఖరీఫ్‌ ఉల్లిపాయల రాక ప్రారంభమైంది. ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే సుమారు 5 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. అయితే ధరల నియంత్రణకు సరఫరా పెరుగుదల కీలకం. ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి వంటింటి కీలక వస్తువుల ధరలు తగ్గితేనే సామాన్య కుటుంబాలకు ఊరట లభిస్తుంది. అప్పటివరకు ఆహార ద్రవ్యోల్బణం కుటుంబాల నెలవారీ ఖర్చులపై ఒత్తిడిని కొనసాగించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: డిసెంబర్‌ 1 నుంచి జీఎస్టీ నిబంధనల్లో మార్పులు

Videos

TDP నేత రాసలీలలు.. బయటపడ్డ సంచలన వీడియో

స్కూల్ బస్సు టైర్ల గాలి తీసిన సర్పంచ్ అక్క

హ్యాట్రిక్ కొట్టిన భారత అమ్మాయిలు.. నాలుగోసారి ఆసియా విజేతగా భారత్

బాపట్లలో ఉద్రిక్తత.. ఆమంచి కారుపై దాడి

బిర్యానీ వదిలేసి.. కూలీల భోజనంతో..! జగ్గూభాయ్ సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే

జనసేన ఉద్యోగాల స్కామ్ లో కీలక పరిణామం

అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళలపై లాఠీ ఛార్జ్

పోలింగ్ బూత్ లో రౌడీ షీటర్ హల్చల్

YSRCP నేతలను దారుణంగా కొట్టిన TDP గూండాలు

బ్యాంకుల బంపరాఫర్.. రూ.2 లక్షలు FD చేస్తే.. రూ.1 లక్ష వడ్డీ!

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో కీర్తి సురేశ్‌ గ్లామరస్ లుక్స్‌ (ఫోటోలు)

+5

సాక్షి ‘స్పెల్‌ బీ’కి విశేష స్పందన (ఫొటోలు)

+5

‘గాగ్రాచోళి’లో గ్లామర్‌ మెరుపులు.. ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ సాత్విక వీరవల్లి(ఫోటోలు)

+5

‘అలియాస్ రుక్మిణి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో జాన్వీ కపూర్‌ సందడి (ఫోటోలు)

+5

గ్లామర్ షోతో అదరగొట్టిన హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ (ఫొటోలు)

+5

నీరో మూవీ గ్లింప్స్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ గ్రాండ్‌ ప్రెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ మూవీ ఉల్లిపూల సాంగ్‌ రిలీజ్ (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన ప్రాంతం... ఎక్కడో మీకు తెలుసా? (ఫోటోలు)