Breaking News

ముడి చమురు, సహజ వాయువు బ్లాక్‌ల వేలం.. ఓన్‌జీసీ,రిలయన్స్‌ పోటీ

Published on Tue, 07/11/2023 - 09:04

న్యూఢిల్లీ: తాజా విడత ముడి చమురు, సహజ వాయువు బ్లాక్‌ల వేలంలో ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ, వేదాంత, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కన్సార్షియం, ఆయిల్‌ ఇండియా, సన్‌ పెట్రోకెమికల్స్‌ మొదలైన అయిదు సంస్థలు పాల్గొన్నాయి. 10 బ్లాక్‌లకు సంబంధించి 13 బిడ్లు దాఖలు చేశాయి. అయితే, ఎక్సాన్‌మొబిల్, షెవ్రాన్, టోటల్‌ఎనర్జీస్‌ వంటి విదేశీ దిగ్గజాలు మాత్రం వేలానికి దూరంగా ఉన్నాయి.

చమురు, గ్యాస్‌ రంగ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌ (డీజీహెచ్‌) ఈ వివరాలు వెల్లడించింది. ఓపెన్‌ ఎక్రేజ్‌ లైసెన్సింగ్‌ పాలసీ (ఓఏఎల్‌పీ) ప్రకారం కేంద్రం గతేడాది జూలైలో ఎనిమిదో విడత కింద 10 బ్లాకులను వేలానికి ఉంచింది. డెడ్‌లైన్‌ను పలుమార్లు పొడిగించిన తర్వాత మొత్తానికి గత వారం బిడ్డింగ్‌ ముగిసింది. డీజీహెచ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఏడు బ్లాకులకు ఒక్కోటి చొప్పున, మిగతా మూడు బ్లాకులకు రెండు చొప్పున బిడ్లు వచ్చాయి. ఆరు బ్లాకుల్లో ఏకైక బిడ్డరుగా నిల్చిన ఓఎన్‌జీసీ మొత్తం మీద పదింటిలో తొమ్మిది బ్లాకులకు బిడ్‌ చేసింది. రిలయన్స్‌–బీపీ బిడ్‌ చేసిన కేజీ బేసిన్‌ బ్లాకు కోసం పోటీపడలేదు.

మరోవైపు, వేదాంత, ఆయిల్, సన్‌ పెట్రోకెమికల్స్‌ తలో బ్లాక్‌ కోసం బిడ్‌ చేసి ఓఎన్‌జీసీకి పోటీదార్లుగా నిల్చాయి. చమురు, గ్యాస్‌ నిక్షేపాలు మరింతగా అందుబాటులోకి వస్తే 157 బిలియన్‌ డాలర్ల చమురు దిగుమతుల భారం తగ్గుతుందని కేంద్రం ఆశిస్తోంది. ఇంధన నిల్వలకు అవకాశమున్న ప్రాంతాలను అన్వేషణ కోసం వేలం వేస్తోంది. ఈ క్రమంలోనే 2016లో కేంద్రం ఓఏఎల్‌పీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటివరకూ 144 బ్లాక్‌లను వేలంలో కేటాయించింది. ఇవి 2.44 లక్షల చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్నాయి. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)