ఓఎన్‌జీసీ రూ.16వేల కోట్ల పెట్టుబడులు

Published on Fri, 02/24/2023 - 18:23

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఓఎన్‌జీసీ చమురు, గ్యాస్‌ ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టింది. అరేబియా సముద్రంలో 103 బావుల్లో వచ్చే 2–3 ఏళ్లలో డ్రిల్లింగ్‌ చేయనున్నట్టు ప్రకటించింది. ‘‘దీనివల్ల 100 మిలియన్‌ టన్నుల ఆయిల్, గ్యాస్‌ అదనంగా ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అదనంగా ఉత్పత్తయ్యే మేర దిగుమతుల భారం తగ్గుతుంది’’ అని ఓఎన్‌జీసీ ప్రకటించింది. మనదేశ చమురు అవసరాల్లో 85 శాతం మేర దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే.

అలాగే సహజవాయువు అవసరాల్లో సగం మేర దిగుమతులైనే ఆధారపడి ఉన్నాం. దేశీయంగా చమురు, గ్యాస్‌ ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చమురు కంపెనీలను కోరడం గమనార్హం. ఓఎన్‌జీసీ ఉత్పత్తి గత కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తోంది. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఉత్పత్తి క్షీణత ఉండదని ఓఎన్‌జీసీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చమురు ఉత్పత్తి 22.83 మిలియన్‌ టన్నులుగా, గ్యాస్‌ ఉత్పత్తి 22.099 బీసీఎంకు పెరుగుతుందని భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చమురు ఉత్పత్తి 24.63 మిలియన్‌ టన్నులు, గ్యాస్‌ ఉత్పత్తి 25.68 బీసీఎంకు చేరుకుంటుందన్న అంచనాతో ఉంది.  

Videos

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

హిమాలయాలు కరుగుతున్నాయ్!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Photos

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)