యూఎస్ మార్కెట్‌కు వన్‌ప్లస్‌ గుడ్‌బై?

Published on Tue, 07/14/2026 - 16:42

ఒకప్పుడు తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ ఫోన్ అంటే.. చాలామందికి ముందుగా గుర్తొచ్చేది వన్‌ప్లస్. ప్రీమియం ఫీచర్లను అందుబాటు ధరలో అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్రాండ్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోబోతోందనే వార్తలు టెక్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి.

జర్మన్ వార్తా సంస్థ విన్‌ఫ్యూచర్ కథనం ప్రకారం, వన్‌ప్లస్ తన మాతృసంస్థ ఒప్పోతో కలిసి అమెరికా, యూరప్ మార్కెట్ల నుంచి పూర్తిగా వైదొలగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై మీడియాతో ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించినట్లు సమాచారం. అయితే.. ఈ నిర్ణయానికి అసలు కారణం ఏమిటనే విషయాన్ని కంపెనీ ఇప్పటివరకు వెల్లడించలేదు.

నెట్టింట్లో వైరల్ అవుతున్న వార్తలు వన్‌ప్లస్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే భారత్‌లో మాత్రం తన వ్యవహారాలను కొనసాగించనుంది. దీనికి కారణం కంపెనీకి భారత్ అతిపెద్ద మార్కెట్ కావడమే. చైనాలో కూడా సంస్థ తన కార్యకలాపాలను యథావిధిగా జరపనుంది.

ఇప్పటికే వన్‌ప్లస్ ఫోన్ ఉపయోగిస్తున్న వారికి కూడా కంపెనీ ఒక క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం.. వినియోగంలో ఉన్న ఫోన్లకు వాటి సపోర్ట్ గడువు పూర్తయ్యే వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, సెక్యూరిటీ అప్‌డేట్లు, సర్వీస్ సెంటర్ సేవలు అందుబాటులోనే ఉంటాయని తెలిపింది. అయితే.. కొత్త ఫోన్ల విడుదల, లేటెస్ట్ స్టాక్ విక్రయం, స్థానిక మార్కెటింగ్ కార్యక్రమాలు మాత్రం నిలిచిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే యూరప్‌లోని కొన్ని దేశాల్లో వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్లలో ఫోన్ల స్టాక్ కూడా దాదాపు ఖాళీ అయిపోయినట్లు తెలుస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)