Breaking News

అవుట్‌డోర్ ఫొటోగ్రఫీ కోసం కొత్త ఉత్పత్తులు

Published on Wed, 09/24/2025 - 11:10

స్మార్ట్‌ఫోన్ల నుంచి పోటీ ఉన్నా ప్రఖ్యాత జపనీస్ కెమెరా తయారీ కంపెనీ ఓఎం సిస్టమ్(గతంలో ఒలింపస్) భారత మార్కెట్‌లోకి తిరిగి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. అవుట్‌డోర్‌ ఫొటోగ్రాఫర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త శ్రేణి ఉత్పత్తులను ప్రారంభించే ప్రణాళికలతో వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. భారత్‌లో ఫొటోగ్రఫీ మార్కెట్‌లో తిరిగి తన వాటాను పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. కంపెనీ తీసుకురాబోయే కెమెరా ఉత్పత్తులు ముఖ్యంగా వన్యప్రాణుల ఫొటోలు, ప్రయాణాలు, కంటెంట్ ​క్రియేటర్లకు ఎంతో తోడ్పడుతాయని స్పష్టం చేసింది.

ఓఎం సిస్టమ్ వేగంగా విస్తరిస్తున్న బహిరంగ ఫొటోగ్రఫీ విభాగంపై దృష్టి సారించింది. అందులో భాగంగా తాజాగా ఓఎం-5 మార్క్ 2 మిర్రర్ లెస్ కెమెరా, ఎం-జుయికో డిజిటల్ ఈడీ 50-200ఎంఎం F2.8 IS PRO లెన్స్‌తోపాటు, అవుట్‌డోర్‌ ఫొటోగ్రఫీ కోసం ప్రీమియం ఇమేజింగ్ ఉత్పత్తులను అందించే దిశగా పని చేస్తున్నట్లు తెలిపింది. ఏపీఏసీ హెడ్, మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ హండూ ఒక ప్రకటనలో మాట్లాడుతూ..‘వినియోగదారులకు ఫొటోగ్రఫీ పట్ల లోతైన అభిరుచి ఏర్పడుతున్నప్పడు సహజంగా స్మార్ట్‌ఫోన్లలోని పరిమితులను అధిగమించి కెమెరాలను ఎంచుకుంటారు. ఓఎం సిస్టమ్ అధునాతన ఆప్టిక్స్, క్లాస్-లీడింగ్ స్టెబిలైజేషన్, వినూత్న డిజైన్లతో ఉత్పత్తులను అందిస్తుంది’ అన్నారు.

ఇదీ చదవండి: బిగ్‌రిలీఫ్‌.. బంగారం ధరలు యూటర్న్‌!

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)