Breaking News

ఓఎల్‌ఎక్స్‌లో ఉద్యోగాల కోత.. పలు దేశాల్లో మూసివేత

Published on Wed, 06/21/2023 - 12:59

నెదర్లాండ్‌కు చెందిన ప్రోసస్ కంపెనీ క్లాసిఫైడ్స్ వ్యాపార విభాగమైన ఓఎల్‌ఎక్స్‌ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 800 ఉద్యోగాలను తొలగించనున్నట్లు ప్రకటించింది. తమ గ్రూప్‌నకు చెందిన ఓఎల్‌ఎక్స్‌ ఆటోస్‌ కార్యకలాపాలను కొన్ని దేశాల్లో మూసివేస్తున్న నేపథ్యంలో లేఆఫ్స్‌ను ప్రకటించినట్లుగా తెలు​స్తోంది. 

ఉద్యోగాల తొలగింపు విషయాన్ని ఓఎల్‌ఎక్స్‌ గ్రూప్‌ టెక్ క్రంచ్‌ వార్తా సంస్థకు ధ్రువీకరించింది. ఆమ్‌స్టర్‌డామ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంగా కంపెనీ ఇటీవలే ఉద్యోగాల కోత గురించి బాధిత ఉద్యోగులకు తెలియజేయడం ప్రారంభించింది. 

‘ఈ సంవత్సరం ప్రారంభంలో ఓఎల్‌ఎక్స్‌ ఆటోస్ వ్యాపారం నుంచి నిష్క్రమించడానికి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నాం. అప్పటి నుంచే సంభావ్య కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల కోసం అన్వేషిస్తున్నాం’ అని కంపెనీ టెక్‌క్రంచ్‌ వార్తా సంస్థకు ఈమెయిల్ ద్వారా పంపిన ప్రకటనలో తెలిపింది. 

అర్జెంటీనా, మెక్సికో, కొలంబియాలో కంపెనీ తన కార్యకలాపాలను మూసివేసింది. ఓఎల్‌ఎక్స్‌ ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలో ప్రోసస్ సంస్థ తన క్లాసిఫైడ్స్ వ్యాపారం ఓఎల్‌ఎక్స్‌ ప్రపంచవ్యాప్తంగా 11,375 మంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: No Work From Home: ఇన్ఫోసిస్‌ మొదలుపెట్టేసింది.. ఉద్యోగులు ఇక ఇల్లు వదలకతప్పదు!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)