Breaking News

లాభాల్లో దూసుకెళ్తున్న ఒలెక్ట్రా - ఆదాయం అక్షరాలా..

Published on Sat, 05/06/2023 - 07:09

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 376 కోట్ల ఆదాయం (కన్సాలిడేటెడ్‌)పై రూ. 27 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఆదాయం రూ. 271 కోట్లుగా, లాభం రూ. 18 కోట్లుగా నమోదైంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం 84 శాతం ఎగిసి రూ. 594 కోట్ల నుంచి రూ. 1,091 కోట్లకు చేరింది. 

నికర లాభం 86 శాతం వృద్ధితో రూ. 35 కోట్ల నుంచి రూ. 66 కోట్లకు పెరిగింది. 2021–22లో 259 ఎలక్ట్రిక్‌ బస్సులు డెలివరీ చేయగా, 2022–23లో 117 శాతం అధికంగా 563 ఈ–బస్సులను అందించినట్లు సంస్థ తెలిపింది. మొత్తం 3,394 బస్సుల కోసం ఆర్డర్లు ఉన్నట్లు వివరించింది. ఎలక్ట్రిక్‌ టిప్పర్లను కూడా విక్రయించడం ప్రారంభించామని, క్యూ4లో 17 వాహనాలను డెలివరీ చేశామని పేర్కొంది.

సరఫరా వ్యవస్థ, స్థూల పరిస్థితులపరమైన రిస్కులు నెలకొన్నప్పటికీ తాము తయారీ, సాంకేతిక సామర్థ్యాలను పెంచుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ సీఎండీ కె.వి. ప్రదీప్‌ తెలిపారు. ఎలక్ట్రిక్‌ బస్సుల విభాగంలో అగ్రగామిగా కొనసాగేందుకు ఇది తోడ్పడుతోందని ఆయన పేర్కొన్నారు.  

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)