Income Tax: పాత విధానమా.. కొత్త విధానమా..?

Published on Mon, 12/16/2024 - 10:11

ఆర్థిక సంవత్సరం 2020–21 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. మీకు ఇష్టమైతే ఈ విధానాన్ని ఎంచుకోవచ్చు. గడువు తేదీలోపల ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే, కొత్త విధానమే పాటించాలి. పాత విధానంలో మినహాయింపులు ఉన్నాయి. రేట్లు 10 శాతం, 20 శాతం, 30 శాతం.. ఇలా ఉన్నాయి. కొత్త విధానంలో మినహాయింపులు ఉండవు. రేట్లు 5,10, 15, 20, 30 శాతంగా ఉన్నాయి. పైన చెప్పినవన్నీ వ్యక్తులకు, హిందూ ఉమ్మడి కుటుంబాలకు వర్తిస్తాయి.  

ఏ ప్రాతిపదికన ఎంచుకోవాలి? 
» మీ ఆదాయ స్వభావం 
» మీ ఆదాయం 
» సేవింగ్స్‌ 
» పెట్టుబడులు 
» సొంతిల్లు రుణం – రుణం మీద వడ్డీ 
» మెడికల్‌ ఖర్చులు, కొన్ని జబ్బుల మీద ఖర్చులు 
» జీతం మీద ఆదాయం ఒక్కటే ఉంటే ఒకలాగా ఆలోచించాలి 
» జీతంతో పాటు ఇతర ఆదాయాలు ఉంటే మరొకలాగా ఆలోచించాలి 
» వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు .. వారి ఇన్వెస్ట్‌మెంట్‌ విధానం 
» ఉద్యోగస్తులు వారికి ఇష్టమైన విధానాన్ని ఎంచుకోవచ్చు. ప్రతి సంవత్సరం మార్చుకోవచ్చు. 
» వ్యాపారస్తులకు అలా మార్చుకునే వెసులుబాటు లేదు 
» ఒకరితో ఒకరు పోల్చుకోకండి. మీ విధానం మీదే. మీ ఆదాయం మీదే. మీ పన్నుభారం మీదే.

ఎటువంటి సేవింగ్స్‌ లేకపోతే కొత్త పద్ధతిలో రూ. 29,900 పన్ను భారం తగ్గుతుంది. సుమారు రూ. 30,000 మిగులు. అయితే, మీ చేతిలో ఎంతో నిలవ ఉంటుంది. దీన్ని మీరు దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు. మీరిచ్చే ప్రాధాన్యత, మీ అవసరం మొదలైన వాటి ప్రకారం మీ ఇష్టం.

మరో కేసులో కేవలం జీతం రూ. 7,00,000 కాగా సేవింగ్స్‌ లేవు అనుకుందాం. అప్పుడు..


కొత్త పద్ధతిలో ట్యాక్స్‌ పడదు. పాత పద్ధతిలో పడుతుంది. పాత పద్ధతిలో పన్ను పడకూడదంటే, ఆ మేరకు సేవింగ్స్‌ చేయాలి. సేవింగ్స్‌ అంటే మీ ఫండ్స్‌ బ్లాక్‌ అవుతాయి. ఆటోమేటిక్‌గా అందరూ కొత్త దాని వైపే మొగ్గు చూపుతారు. అయితే ఉద్యోగంలో కంపల్సరీగా పీఎఫ్‌ మొదలైన సేవింగ్స్‌ ఉంటాయి. ముందు జాగ్రత్తగా మనం సేవ్‌ చేస్తుంటాం. మన అవసరాలను, కలలను, ఆలోచనలను దృష్టిలో పెట్టుకోవాలి.  ఒకే కుటుంబంలో ఇద్దరు ఉద్యోగస్తులంటే, ఒకరు సేవ్‌ చేసి మరొకరు మానేసి.. ఇద్దరూ కొంత చేసి.. ఇలా ఎన్నో ఆలోచనలే మీ ట్యాక్స్‌ ప్లానింగ్‌కి దారి తీస్తాయి.

పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్‌ పంపించగలరు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)