Breaking News

పాత పన్ను విధానం రద్దు? ఆర్థిక మంత్రి చెప్పిందిదే..

Published on Wed, 07/24/2024 - 09:34

Union Budget 2024: పన్ను చెల్లింపుదారులు ఆసక్తిగా ఎదురుచూసిన 2024-25 కేంద్ర బడ్జెట్‌ను ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయకుండా కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించేలా కొన్ని చర్యలను ఈ బడ్జెట్‌లో ఎన్‌డీఏ సర్కారు ప్రకటించింది.

ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి పాత పన్ను విధానాన్ని ప్రభుత్వం రద్దు చేస్తుందా అనుమానం సర్వత్రా నెలకొంది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. పాత పన్ను విధానాన్ని ఎప్పుడు రద్దు చేయాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక మంత్రి తెలిపారు.

"పాత పన్ను విధానాన్ని ఏం చేయాలన్నదానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పన్ను విధానాన్ని సరళీకృతం చేయాలన్నదే మా 
ఉద్దేశం అని మాత్రమే చెప్పగలం. పాత పన్ను విధానం ఉంటుందో లేదో చెప్పలేను" అన్నారామె.

కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహిస్తూ తాజా బడ్జెట్‌లో పలు ప్రయోజనాలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50,000 నుంచి రూ. 75,000కి పెంచడం, స్లాబ్‌లను విస్తరించడం వంటివి ఉన్నాయి. దీంతో జీతం పొందే పన్ను చెల్లింపుదారులు సంవత్సరానికి రూ.17,500 వరకు ఆదా చేసుకోవచ్చని ఆమె చెప్పారు.

కొత్త పన్ను విధానాన్ని 2020లో ప్రవేశపెట్టారు. గత సంవత్సరం బడ్జెట్‌లో దీన్ని డిఫాల్ట్‌  చేశారు. పాత పన్ను విధానం ఇంటి అద్దె, సెలవు ప్రయాణ భత్యాలు, అలాగే సెక్షన్లు 80C, 80D, 80CCD(1b), 80CCD(2) కింద తగ్గింపులతో సహా అనేక తగ్గింపులు, మినహాయింపులను అందిస్తుంది. కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపులు, తగ్గింపులు లేవు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)