Breaking News

ఓలా కొత్త స్కూటర్లు.. 320 కి.మీ.రేంజ్‌!

Published on Fri, 01/31/2025 - 18:18

ప్రముఖ విద్యుత్‌ ద్విచక్రవాహన సంస్థ ఓలా (Ola) తమ మూడో తరం ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని భారత్‌ మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. వీటిలో ఎంట్రీ-లెవల్ మోడల్‌ ధర రూ.79,999 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమై అగ్రశ్రేణి వేరియంట్‌ ధర రూ.1,69,999 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ శ్రేణిలో ఎస్‌1 ప్రో (S1 Pro), ఎస్‌1 ప్రో+ (S1 Pro+), ఎస్‌1 ఎక్స్‌ (S1 X), ఎస్‌1 ఎక్స్‌+ (S1 X+) ఉన్నాయి.

పేటెంట్ పొందిన 'బ్రేక్ బై వైర్' సాంకేతికతను ఓలా  Gen 3 లైనప్‌కు జోడించింది. ఈ సిస్టమ్ బ్రేక్ ప్యాడ్, మోటర్‌ నిరోధకతను సమతుల్యం చేయడానికి బ్రేక్ లివర్‌పై సెన్సార్‌లను ఉపయోగిస్తుంది. ఇది రేంజ్‌ను  15% పెంచడమే కాకుండా బ్రేక్ ప్యాడ్ మన్నికను రెట్టింపు చేస్తుంది. ఇక మెరుగైన భద్రత కోసం ప్రతి స్కూటర్‌లోనూ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) అమర్చారు.

బ్యాటరీ ఆప్షన్స్‌.. రేంజ్‌
ఓలా మూడో తరం స్కాటర్‌లలో వివిధ బ్యాటరీ ఎంపికలు ఉన్నాయి. ఎస్‌1 ప్రో మోడల్ 3kWh, 4kWh బ్యాటరీలను కలిగి ఉంటుంది. ప్రో+ వేరియంట్ 4kWh, 5.3kWh బ్యాటరీ ప్యాక్‌లను అందిస్తుంది. ఇక ఎంట్రీ-లెవల్ ఎస్‌1 ఎక్స్‌ 2kWh, 3kWh, 4kWh బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంది. అయితే ఎస్‌1 ఎక్స్‌+ మాత్రం ప్రత్యేకంగా 4kWh బ్యాటరీతో వస్తుంది. ఫ్లాగ్‌షిప్ ఎస్‌1 ప్రో+ మోడల్ 320 కిమీ రేంజ్‌ని, 141 కి.మీ.గరిష్ట వేగాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

ధరలు

మోడల్‌బ్యాటరీ కెపాసిటీధర
ఓలా ఎస్‌1 ఎక్స్‌2 kWh    రూ.79,999
ఓలా ఎస్‌1 ఎక్స్‌    3 kWh    రూ.89,999
ఓలా ఎస్‌1 ఎక్స్‌    4 kWh    రూ.99,999

ఓలా ఎస్‌1 ఎక్స్‌+    
4 kWh    రూ.1,07,999
ఓలా ఎస్‌1 ప్రో     3 kWh    రూ.1,14,999
ఓలా ఎస్‌1 ప్రో    4 kWh    రూ.1,34,999

ఓలా ఎస్‌1 ప్రో+    
4 kWh    రూ.1,54,999
ఓలా ఎస్‌1 ప్రో+   5.3 kWh    రూ.1,69,999






 

Videos

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)