Breaking News

ఓలా నుంచి తొలి ఎలక్ట్రిక్‌ బైక్‌

Published on Thu, 08/15/2024 - 20:34

ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ అనే పేరుతో తమ తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల శ్రేణిని ప్రకటించింది. రోడ్‌స్టర్ ప్రో , రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ఎక్స్‌ అనే మూడు వేరియంట్లను గురువారం తమ వార్షిక ఈవెంట్ “సంకల్ప్” సందర్భంగా లాంచ్‌ చేసింది. వీటి ధరలు రూ. 74,999 నుంచి రూ. 2,49,999 మధ్య ఉండనున్నాయి. మూడు మోడల్స్‌కు రిజిస్ట్రేషన్స్‌ కూడా ప్రారంభమయ్యాయి.

చౌకైన రోడ్‌స్టర్ ఎక్స్‌, రోడ్‌స్టర్ మోడల్‌లు 2.5 KwH నుంచి 6 Kwh బ్యాటరీ బ్యాక్‌లతో వస్తాయి.  2025 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వీటి డెలివరీలు  ప్రారంభమవుతాయి. అలాగే ప్రీమియం రోడ్‌స్టర్ ప్రో 8 KwH, 16 KwH వేరియంట్‌లలో 2025 నవంబర్ నాటికి అందుబాటులో ఉంటుందని ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలిపారు.

ఓలా రోడ్‌స్టర్ ఎక్స్‌
రోడ్‌స్టర్ ఎక్స్‌ 11 kW గరిష్ట మోటార్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. 3 బ్యాటరీ ప్యాక్ ఎంపికలు- 2.5 kWh, 3.5 kWh, 4.5 kWh ఉన్నాయి. వీటిలో టాప్‌ వేరియంట్‌ 124 కి.మీ గరిష్ట వేగం, 200 కి.మీ. రేంజ్‌ని అందిస్తుంది. కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS) తోపాటు  4.3-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఓలా మ్యాప్స్ నావిగేషన్ వంటి అనేక రకాల డిజిటల్ టెక్ ఫీచర్‌లను అందిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ యాప్ కనెక్టివిటీతో వస్తుంది. 2.5 kWh వేరియంట్‌ ధర రూ. 74,999, 3.5 kWh రూ. 84,999, 4.5 kWh మోడల్‌ ధర రూ. 99,999.

ఓలా రోడ్‌స్టర్
రోడ్‌స్టర్ 13 kW మోటారుతో ఆధారితమైనది. ఇందులో 3.5 kWh, 4.5 kWh, 6 kWh బ్యాటరీ వేరియంట్‌లు ఉన్నాయి. టాప్‌ వేరియంట్‌ గరిష్టంగా 126 కి.మీ గరిష్ట వేగం, 248 కి.మీ. రేంజ్‌ని అందిస్తుంది. 6.8-అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్‌, ప్రాక్సిమిటీ అన్‌లాక్, క్రూయిజ్ కంట్రోల్, పార్టీ మోడ్, ట్యాంపర్ అలర్ట్  వంటి స్మార్ట్ ఫీచర్‌లతో పాటు కృత్రిమ్ అసిస్టెంట్, స్మార్ట్‌వాచ్ యాప్, రోడ్ వంటి ఏఐ- పవర్డ్ ఫీచర్‌లతో వస్తుంది. మోటార్‌సైకిల్ ముందు, వెనుక వైపున డిస్క్ బ్రేక్‌లు, ఏబీఎస్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఉన్నాయి. 3.5 kWh మోడల్‌ ధర రూ. 1,04,999, 4.5 kWh రూ.1,19,999, 6 kWh ధర రూ.1,39,999.

ఓలా రోడ్‌స్టర్ ప్రో
ఈ శ్రేణి మోటర్‌ సైకిళ్లు 52 kW గరిష్ట పవర్ అవుట్‌పుట్‌, 105 Nm టార్క్‌తో కూడిన మోటారుతో వస్తాయి. 16 kWh వేరియంట్ 194 kmph గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. 579 కిమీ రేంజ్‌ను ఇస్తుంది. ఇది సెగ్మెంట్‌లో అత్యంత వేగవంతమైనది మాత్రమే కాకుండా అత్యంత సమర్థవంతమైన మోటార్‌సైకిల్‌గా కూడా నిలిచింది.  రోడ్‌స్టర్ ప్రోలో 10-అంగుళాల TFT టచ్‌స్క్రీన్, USD (అప్‌సైడ్ డౌన్) ఫోర్క్‌లు, ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లకు ఏబీఎస్‌ సిస్టమ్‌ ఇచ్చారు. ఇందులో 8 kWh వేరియంట్‌ ధర రూ. 1,99,999, 16 kWh వేరియంట్‌ ధరను రూ. 2,49,999 లుగా కంపెనీ పేర్కొంది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)