Breaking News

ఓలా డ్రైవర్లకు జీరో కమీషన్‌

Published on Wed, 06/18/2025 - 14:44

దేశవ్యాప్తంగా జీరో కమీషన్ మోడల్‌ను అమలు చేస్తున్నట్లు ఓలా క్యాబ్స్‌ తెలిపింది. 10 లక్షలకు పైగా డ్రైవర్ భాగస్వాములు తమ సంపాదనలో 100 శాతం ఆదా చేసుకోవచ్చని చెప్పింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా ఉన్న ఈ కార్యక్రమం ఆటోలు, బైకులు, క్యాబ్‌ డ్రైవర్లకు బిగ్‌ రిలీఫ్‌ అవుతుందని పేర్కొంది. రైడ్ పరిమాణం లేదా ఆదాయంపై ఎటువంటి పరిమితులను ఉండవని పేర్కొంది.

కొత్త ప్రోగ్రామ్‌లో భాగంగా డ్రైవర్లు ఈ ప్రణాళికను ఎంచుకోవచ్చని చెప్పింది. కమీషన్‌ రూపంలో ఓలాకు వెళ్లే ఛార్జీలను ఎటువంటి మినహాయింపులు లేకుండా డ్రైవర్లు ఆ మొత్తాన్ని పొందవచ్చు. అయితే అందుకు నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ పొందాలని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ను ఉపయోగించుకునే డ్రైవర్లు 30 రోజుల పాటు రోజుకు రూ.67 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అంటే నెలకు రూ.2,010 అవుతుంది.

ఇదీ చదవండి: వార్షిక టోల్‌ పాస్‌ను ప్రకటించిన కేంద్రం

ఈ ఫీచర్‌తో డ్రైవర్లు జీరో కమీషన్ క్లెయిమ్ చేసుకునే ఛార్జీలపై ఎలాంటి పరిమితులు లేవని, తమ ఛార్జీల మొత్తాన్ని క్లెయిమ్ చేసేటప్పుడు వాహనం ఎంపికపై కంపెనీ ఎలాంటి ఆంక్షలు విధించదని తెలిపింది. ఈ ఫీచర్ ఓలా ఆటో, ఓలా బైక్స్, ఓలా క్యాబ్స్‌కు అందుబాటులో ఉంది. ‘కమీషన్లను తొలగించడం వల్ల డ్రైవర్ భాగస్వాములకు మరింత అవకాశాలు లభిస్తాయి’ అని ఓలా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మార్పు వల్ల డ్రైవర్ ఆదాయం ఏటా రూ.1,36,000 పెరుగుతుందని, ప్రస్తుత స్థాయిలతో పోలిస్తే ఇది 30 శాతం అధికమని చెప్పింది.

#

Tags : 1

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు