Breaking News

ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల విస్తరణలో పెరిగిన వేగం! ఒకే రోజు..

Published on Tue, 04/04/2023 - 18:10

ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని ఓలా ఎలక్ట్రిక్ దేశ వ్యాప్తంగా ఒకే రోజున 50 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది. ఇందులో మూడు సెంటర్లు హైదరాబాద్ నగరంలో ప్రారంభం కావడం విశేషం. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలను అందించడంలో భాగంగానే సంస్థ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను వేగంగా ప్రారంభిస్తోంది. ఈ కొత్త ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లు హైదరాబాద్ మాదాపూర్ శ్రీరామకాలనీలో (హైటెక్ సిటీ రోడ్), నాగోల్లోని ఆదర్శ్ నగర్, మెహదీపట్నంలో రేతిబౌలిలో మొత్తం మూడు కొత్తగా ప్రారంభమయ్యాయి.

ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించిన సందర్భంగా ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ఓలా కస్టమర్లకు మరింత చెరువులో ఉండటానికి లేదా కొత్త కస్టమర్ల సందేహాలను తీర్చడానికి గత కొన్ని రోజులుగా దేశం మొత్తం మీద అనుభవ కేంద్రాలను ప్రారంభిస్తున్నాము, రానున్న రోజుల్లో మరిన్ని భారతీయ ప్రధాన నగరాల్లో ఈ కేంద్రాలను ప్రారభినానున్నట్లు తెలిపారు.

(ఇదీ చదవండి: ఓలా ఎస్1 ప్రో కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్: ఈ నెల 16 వరకే..!)

నిజానికి ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు వినియోగదారులకు ఒకే ప్రదేశంలో సమగ్రమైన సేవలను అందించేలా డిజైన్ చేశారు. ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్లను ఈ సెంటర్ల ద్వారా టెస్ట్ రైడ్ చేయడానికి కూడా తీసుకెళ్లే సదుపాయం కల్పిస్తారు. అంతే కాకుండా కొనుగోలుదారులకు మరింత సులభమైన పద్దతిలో ఫైనాన్సింగ్ ఎంపికల గురించి కూడా సమచారం అందించడంలో సహాయపడతాయి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)