Breaking News

ఓలా ఎలక్ట్రిక్‌ 'నష్ట' కష్టాలు..

Published on Sat, 02/08/2025 - 08:06

ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన(ఈ2డబ్ల్యూ) కంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ (Ola Electric) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(Q3)లో నికర నష్టం భారీగా పెరిగి రూ. 564 కోట్లకు చేరింది. ఆదాయం నీరసించడం, తీవ్రతర పోటీ, సర్వీస్‌ సవాళ్లతో పెరిగిన వ్యయాలు ప్రభావం చూపాయి.

గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 376 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,296 కోట్ల నుంచి రూ. 1,045 కోట్లకు క్షీణించింది. మొత్తం వ్యయాలు రూ. 1,597 కోట్ల నుంచి రూ. 1,505 కోట్లకు తగ్గాయి. ఈ కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 3.33 లక్షల యూనిట్ల ఈ2డబ్ల్యూ రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు ఓలా వెల్లడించింది. గతేడాది క్యూ3తో పోలిస్తే ఇవి 37 శాతంపైగా అధికమని తెలియజేసింది. సర్వీసింగ్‌ సమస్యల పరిష్కారానికి రూ. 110 కోట్లు వెచ్చించినట్లు పేర్కొంది.  ఫలితాల నేపథ్యంలో ఓలా షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.4 శాతం నీరసించి రూ. 70 వద్ద ముగిసింది.

ఎంఅండ్‌ఎం లాభం స్పీడ్‌
ఆటో రంగ దేశీ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా (Mahindra & Mahindra) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 20 శాతం జంప్‌చేసి రూ. 3,181 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో రూ. 2,658 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం ఎగసి రూ. 41,470 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 35,299 కోట్ల టర్నోవర్‌ నమోదైంది.

ఆటో విభాగంలో అమ్మకాలు 16 శాతం పుంజుకుని 2,45,000కు చేరగా.. యూవీ విక్రయాలు 1,42,000 యూనిట్లను తాకాయి. ఈ విభాగం ఆదాయం 21 శాతం జంప్‌చేసి రూ. 23,391 కోట్లకు చేరింది. నికర లాభం 20 శాతం బలపడి రూ. 1,438 కోట్లయ్యింది. వ్యవసాయ పరికరాల విభాగం నికర లాభం 11 శాతం పుంజుకుని రూ. 996 కోట్లను తాకింది.  ఫలితాల నేపథ్యంలో ఎంఅండ్‌ఎం షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.7 శాతం లాభంతో రూ. 3,193 వద్ద ముగిసింది.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)