ఓలా ఎలక్ట్రిక్‌కు తగ్గిన నష్టం

Published on Sat, 11/09/2024 - 12:46

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహన(ఈవీ) రంగ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు వెలువరించింది. అయితే కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో నికర నష్టం స్వల్పంగా తగ్గి రూ. 495 కోట్లకు పరిమితమైంది. అధిక విక్రయాలు ఇందుకు సహకరించాయి.

గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 524 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 873 కోట్ల నుంచి రూ. 1,214 కోట్లకు ఎగసింది. వాహన విక్రయాలు 74 శాతం జంప్‌చేసి 98,619 యూనిట్లను తాకాయి. 2025 మార్చికల్లా కంపెనీ 2,000 సొంత ఔట్‌లెట్లకు నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్‌ పేర్కొంది. 2024 సెప్టెంబర్‌కల్లా 782 స్టోర్లను కలిగి ఉంది. ఫలితాల నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్‌ షేరు బీఎస్‌ఈలో 2.5% నష్టంతో రూ. 73 వద్ద ముగిసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)