Breaking News

తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు!

Published on Wed, 03/08/2023 - 16:18

హోలీ పండుగ సందర్భంగా ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. కొత్తగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావించే వారికి భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. పండుగ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటి వాటిని అందిస్తోంది. ఓలా ఎస్ 1, ఓలా ఎస్ 1 ప్రో స్కూటర్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇదీ చదవండి: గూగుల్‌ ఉద్యోగులకు బ్యాడ్‌ న్యూస్‌.. ఈసారి ఆ భాగ్యం కొందరికే!

పాత ద్విచక్రవాహనాల ఎక్స్చేంజ్‌పై భారీగా.. 
ప్రస్తుతం ఓలా ఎస్‌1 వేరియంట్‌పై రూ.2వేలు, ఎస్‌1 ప్రో వేరియంట్‌పై రూ.4 వరకు తగ్గింపు ఇస్తున్నారు. ఇక పాత పెట్రోల్ బైక్ లేదా స్కూటర్ ఎక్స్చేంజ్ చేస్తే గరిష్టంగా రూ. 45 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. అంతేకాకుండా ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ద్వారా రూ.6,999 వరకు అదనపు డిస్కౌంట్‌ లభిస్తుంది. అలాగే ఓలా కమ్యూనిటీ సభ్యులకు ఓలా కేర్ ప్లస్‌ సబ్‌స్క్రిప్షన్‌, ఎక్సెంటెడ్ వారంటీస్‌పై 50 శాతం తగ్గింపు అందిస్తోంది. అయితే ఈ ఆఫర్లన్నీ మార్చి 8 నుంచి 12 వరకే. ఓలా హోలీ ఆఫర్ల ద్వారా కస్టమర్ల పండుగ ఆనందం మరింత పెరుగుతుందని ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్సూల్ ఖండేల్‌వాలా పేర్కొన్నారు.

ఓలా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు
ఓలా కేర్ సర్వీసుల్లో ఓలా కేర్, ఓలా కేర్ ప్లస్‌ అని రకాల ప్లాన్స్ ఉన్నాయి.  ఓలా కేర్ ప్లాన్ ద్వారా ఫ్రీ లేబర్ సర్వీర్, థెఫ్ట్ అసిస్టెన్స్, రోడ్ సైడ్ అసిస్ట్, పంచర్ అసిస్ట్ వంటి సేవలు లభిస్తాయి. ఇక ఓలా కేర్ ప్లస్ విషయానికి వస్తే.. యాన్వల్ కాంప్రెహెన్సిల్ డయాగ్నస్టిక్, ఫ్రీ అంబులెన్స్, ఫ్రీ హోమ్ సర్వీస్, పికప్ అండ్ డ్రాప్ వంటి ప్రయోజనాలు పొందవచ్చు. కాగా డీ2సీ(డైరెక్ట్‌ టు కస్టమర్‌) సేవలను విస్తరించే పనిలో ఉన్న ఓలా మార్చి 2023 నాటికి అన్ని ప్రధాన నగరాల్లో 500 కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లను తెరుస్తోంది.

Videos

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)