ఓలా ఎలక్ట్రిక్‌ బంపరాఫర్‌!

Published on Mon, 01/08/2024 - 22:02

ప్రముఖ ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారీ సంస్థ ఓలా కీలక ప్రకటన చేసింది. త్వరలో ఓలా 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుందని ఆ సంస్థ సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ ప్రకటించారు. త‌మిళ‌నాడు గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ మీట్‌లో మాట్లాడిన ఆయ‌న..త‌మిళ‌నాడులోని కృష్ణ‌గిరి జిల్లాలో న్యూ ఈవీ మాన్యుఫాక్చ‌రింగ్ యూనిట్ నిర్మిస్తున్నారు. ఈ యూనిట్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వ‌స్తే సుమారు 25 వేల మందికి కొలువులు ల‌భిస్తాయ‌ని తెలిపారు. 

తద్వారా ప్ర‌తి ఏటా సుమారు ఒక కోటి టూ వీల‌ర్స్ త‌యార‌వుతాయ‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు చెప్పారు. ఈ యూనిట్ కోసం గ‌తేడాది త‌మిళ‌నాడు ప్ర‌భుత్వంతో ఓలా ఎల‌క్ట్రిక్.. ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మాన్యుఫాక్చ‌రింగ్ యూనిట్ కోసం ఓలా ఎల‌క్ట్రిక్ రూ.7000 కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధమైంది.  

ఈ సందర్భంగా ఎనిమిది నెల‌ల్లో దేశంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్స్ త‌యారీ యూనిట్ విజ‌య‌వంతంగా నిర్మించుకున్న‌ట్లు భ‌విష్ అగ‌ర్వాల్ తెలిపారు. వ‌చ్చేనెల నుంచి ఈవీ స్కూట‌ర్ల ఉత్ప‌త్తి త‌యార‌వుతుంద‌ని అన్నారు. 

గ‌త జూన్‌లోనే త‌మిళ‌నాడులో మెగా మాన్యుఫాక్చ‌రింగ్ ఫ్యాక్ట‌రీ నిర్మిస్తామ‌ని ఓలా ఎల‌క్ట్రిక్ వెల్ల‌డించింది. ఓలా ఫ్యూచ‌ర్ ఫ్యాక్ట‌రీ స‌హ‌కారంతో త‌మిళ‌నాడు గిగా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తున్న‌ట్లు తెలిపింది. దేశీయ ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్స్ మార్కెట్లో ఓలా ఎల‌క్ట్రిక్ లీడ‌ర్గా నిలిచింది. న‌వంబ‌ర్ నెలాఖ‌రు నాటికి మొత్తం ఈవీ స్కూట‌ర్ల విక్ర‌యంలో ఓలా ఎల‌క్ట్రిక్ వాటా సుమారు 32 శాతం. గ‌తేడాది నవంబ‌ర్ నాటికి దాదాపు 30 వేల ఈవీ స్కూట‌ర్ల‌ను విక్ర‌యించింది.

Videos

ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. 8వ రోజు ఏకంగా 7 పతకాలు

పోలీసుల లాఠీ ఛార్జ్... సచివాలయం ఉద్యోగుల ధర్నాలో అడ్వకేట్ రజినీకి అస్వస్థత

ఉద్యోగాలు చేస్తాం.. ఊడిగం చేయం..! బాబు ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం

దక్షిణాఫ్రికాలో కాల్పుల కలకలం.. 31 మంది మృతి.. 26 మందికి గాయాలు

ఇది ప్రజాస్వామ్యమేనా ? బాబుకు జగన్ సీరియస్ వార్నింగ్

ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. బ్యాంకు సమ్మె వాయిదా

జగన్ కోసం ప్రాణమే ఇస్తా.. ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యే సీటు ఎంత..!

సింహం సింగిల్ గానే వస్తుంది.. BC గర్జన సభలో గర్జించిన జోగి రమేష్, విడదల రజిని

ఒక్కసారి ఊహించుకో.. లక్ష 35 వేల మంది ఉద్యోగులు తిరగబడితే..

యమపాశంగా మారిన ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే

Photos

+5

86వ శతకం.. రికార్డులు తిరగరాసిన 'కింగ్‌' (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' సాంగ్ లాంచ్‌లో డింపుల్ (ఫొటోలు)

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)