Breaking News

రాష్ట్రాల్లో అధికారుల తీరు మారటంలేదు..

Published on Fri, 09/29/2023 - 05:31

న్యూఢిల్లీ: రాష్ట్రాల్లోని అధికారుల ఇంకా ఆనాటి నియంత్రణల జమానా (లైసెన్స్‌ రాజ్‌)లో ఉన్నట్లుగానే వ్యవహరిస్తున్నారని కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ ఆక్షేపించారు. దీనివల్ల కేంద్రం ఎన్ని సంస్కరణలను ప్రవేశపెడుతున్నా తయారీ రంగ వృద్ధి పెద్దగా మెరుగుపడటం లేదని ఆయన చెప్పారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకు కేంద్రం గత తొమ్మిదేళ్లలో 1,000కి పైగా పాత చట్టాలను తొలగించిందని పేర్కొన్నారు.

తయారీ రంగంలో దీటుగా పోటీపడేందుకు బాటలు వేస్తోందని, కానీ దురదృష్టవశాత్తూ ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదని చెప్పారు. ‘తయారీదారులు, ఎంట్రప్రెన్యూర్లు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనే సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం తరహాలో రాష్ట్ర ప్రభుత్వాల్లో బ్యూరోక్రసీ, పాలనా యంత్రాంగం మారలేదు.

ప్రతి దానికీ బోలెడంత జాప్యం ఉంటోంది. రాష్ట్రాల్లో చాలా మంది సమయానికి విలువనివ్వడం లేదు. పాలనా యంత్రాంగం ధోరణి ఆనాటి లైసెన్స్‌ రాజ్‌ తరహాలో ఉంటోంది. ప్రభుత్వోద్యోగి పని అంటే నియంత్రించడమే తప్ప వెసులుబాటు కల్పించడం కాదనే విధంగా ఉంటోంది‘ అని భార్గవ చెప్పారు. ఇటు వ్యాపారవేత్తల్లో కూడా అప్పటి ఆలోచనా ధోరణులు అలాగే ఉండిపోవడం సైతం తప్పు విధానాలకు దారి తీస్తోందని తెలిపారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)