Breaking News

మూడు రూపాయల దాన్ని..ముక్కు పిండేదాకా తెచ్చుకున్నాడు!

Published on Fri, 09/29/2023 - 14:49

మూడు రూపాయల చిల్లర ఇవ్వడానికి నిరాకరించిన  జిరాక్స్‌ షాప్‌ యజమానికి భారీ షాక్‌  తగిలింది. పైగా బెగ్గర్‌ అంటూ కస్టమర్‌ని దుర్బాష లాడాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు కస్టమర్‌ వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు.  దీంతో  రూ.25,000 జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.  
 
ఒడిశాలోని సంబల్‌పూర్‌లోని ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక ఫోటోకాపీ దుకాణం యజమాని కస్టమర్‌కు రూ.3 తిరిగి ఇవ్వడానికి నిరాకరించిన కేసును విచారించిన సంబల్‌పూర్ కోర్టు రూ. 25 వేలు 30 రోజుల్లోపు  చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు నిర్ణీత గడువులోగా జరిమానా చెల్లించకుంటే సంవత్సరానికి 9 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని కూడా  తీర్పునిచ్చింది. 

బుధరాజా ప్రాంతానికి చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రఫుల్ల కురార్ దాస్‌  ఏప్రిల్ 28న  జిరాక్స్‌  కోసం  ఫోటో కాపీ సెంటర్‌కి వెళ్లాడు.   కాపీ రూ.2 ల చార్జీకి గాను  రూ. 5 దుకాణదారుడికిచ్చాడు. మిగిలిన రూ. 3  తిరిగి అడగ్గా ఇవ్వడానికి  నిరాకరించాడు. అంతేకాదు  బెగ్గర్‌ అంటూ దుర్భాషలాడాడు.  అడగ్గా .అడగ్గా. ..పైగా బిచ్చమేశా అనుకుంటూ అంటూ అనుచితంగా  ప్రవర్తించాడు.

దీంతో తనకు చిల్లర ఇవ్వకపోగా, దురుసుగా ప్రవర్తించడంతోపాటు రసీదు కూడా ఇవ్వలేదంటూ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. తనకు ఆర్థిక నష్టంతోపాటు, మానసిక వేదన, అవమానానికి గురయ్యానంటూ పేర్కొన్నారు. ఇది కేవలం వ్యక్తిగత కేసు మాత్రమే కాదు. వినియోగ దారులందరి హక్కులకు సంబంధించింది. అందుకే కోర్టును ఆశ్రయించి, న్యాయం పొందాను అంటూ తెలిపారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)