Breaking News

అయోధ్య రామ మందిరం : పన్ను చెల్లింపు దారులకు శుభవార్త!

Published on Mon, 01/22/2024 - 16:56

అయోధ్యలో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతం అయింది. బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండువ జరిగింది. దీంతో ప్రపంచం మొత్తం రామనామ స్మారణ మారుమ్రోగుతుంది. భక్తులు భారీ ఎత్తున రాములోరికి విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. 

ఈ తరుణంలో విరాళాల సేకరణకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఏర్పాట్లు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇక నిబంధనలకు అనుగుణంగా అయోధ్య రామమందిర్ ట్రస్ట్‌కు చేసే విరాళంతో ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.  

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) అయోధ్య రామమందిరాన్ని ప్రజల ప్రార్థనా స్థలంగా ప్రకటించింది. మే 8, 2020 నాటి సీబీడీ సర్క్యులర్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వం 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం' (పాన్: AAZTS6197B) చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా, ప్రజల ఆరాధనా స్థలంగా ప్రసిద్ధి చెందింది. అందువల్ల, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అయోధ్య రామమందిర మరమ్మతు, నిర్వహణ కోసం అన్ని విరాళాలు సెక్షన్ 80జీ కింద మినహాయింపు పొందవచ్చు’ అని తెలిపింది.  ఈ విరాళంలో 50 శాతం సెక్షన్ 80G (2)(B) కింద పేర్కొన్న షరతులకు లోబడి పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 80 జీ కింద రూ. 2000 కంటే ఎక్కున నగదు విరాళం పన్ను మినహాయింపు పరిధిలోకి రాదు.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)