ఎన్‌టీపీసీ రూ. 2.50 డివిడెండ్‌

Published on Sat, 10/26/2024 - 04:45

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్‌టీపీసీ లాభం 14 శాతం ఎగిసి రూ. 5,380 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 4,726 కోట్లు. అయితే, ఆదాయం రూ. 45,385 కోట్ల నుంచి రూ. 45,198 కోట్లకు తగ్గింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 10 ముఖ విలువ గల షేర్లపై రూ. 2.50 చొప్పున తొలి మధ్యంతర డివిడెండ్‌ ఇచ్చే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. డివిడెండ్‌ చెల్లింపు తేదీ నవంబర్‌ 18గా ఉంటుంది.

 లడఖ్‌లోని చుషుల్‌లో సోలార్‌ హైడ్రోజన్‌ ఆధారిత మైక్రోగ్రిడ్‌ను ఏర్పాటు చేసేందుకు భారతీయ ఆర్మీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ తెలిపింది. రెండో త్రైమాసికంలో స్థూల విద్యుదుత్పత్తి 90.30 బిలియన్‌ యూనిట్ల  నుంచి 88.46 యూనిట్లకు తగ్గింది. క్యాప్టివ్‌ బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి 5.59 మిలియన్‌ టన్నుల  నుంచి 9.03 ఎంఎంటీకి పెరిగింది. గ్రూప్‌ స్థాయిలో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 73,824 మెగావాట్ల నుంచి 76,443 మెగావాట్లకు చేరింది.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)