Breaking News

యురేనియం అన్వేషణకు ఎన్‌టీపీసీ ఒప్పందం

Published on Mon, 09/29/2025 - 10:46

ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్‌టీపీసీ(NTPC) విదేశాల్లో యురేనియం గనులను గుర్తించడానికి కన్సల్టెంట్‌ను నియమించుకోవాలని యోచిస్తోంది. దీని ద్వారా తన భవిష్యత్ అణు ప్రాజెక్టుల కోసం యురేనియం వనరులను స్థిరీకరించుకోవడానికి ముందుకు సాగుతోంది. ఈమేరకు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.

ఈ ఒప్పందంలో భాగంలో నియమించుకునే కన్సల్టెంట్ సంభావ్య ప్రదేశాలపై సలహా ఇస్తారు. యురేనియం నిల్వల(uranium mines)పై మార్గనిర్దేశం చేయడానికి రిజర్వ్ పరిమాణాలు, లాజిస్టిక్స్ ఖర్చులు వంటి అంశాలను అంచనా వేస్తారు. ప్రస్తుతం ఎన్‌టీపీసీ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్)తో జాయింట్ వెంచర్ ద్వారా రాజస్థాన్‌లో రూ.42,000 కోట్ల అణు ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఎన్‌టీపీసీకి 49% వాటా, ఎన్‌పీసీఐఎల్ 51% వాటా కలిగి ఉంది.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ 4x700 మెగావాట్ల మహి బన్స్‌వారా రాజస్థాన్ అణు విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీన్ని అణుశక్తి విద్యుత్‌ నిగమ్ లిమిటెడ్ (అశ్విని)తో కలిసి అభివృద్ధి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గుర్దీప్ సింగ్ మాట్లాడుతూ వివిధ అణు సాంకేతిక ప్రొవైడర్లు, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి అదనపు అణు ప్రాజెక్టులను స్వతంత్రంగా ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఈ విభాగంలో కంపెనీ తన ఉనికిని విస్తరించడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)