Breaking News

స్టాక్‌ మార్కెట్‌లో భారీగా పెరిగిన ఇన్వెస్టర్లు..

Published on Fri, 09/26/2025 - 16:17

స్టాక్‌ ఎక్స్ఛేంజీ దిగ్గజం నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (NSE) యూనిక్‌ ఇన్వెస్టర్ల సంఖ్య తాజాగా 12 కోట్లను అధిగమించింది. గత 8 నెలల్లోనే కోటిమంది జత కలిసినట్లు ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది. కాగా.. ప్రతీ నలుగురిలో ఒకరు మహిళా ఇన్వెస్టర్‌ అని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా ఎన్‌ఎస్‌ఈ ఇన్వెస్టర్ల సంఖ్య 11 కోట్లను దాటింది.

నిజానికి ఎన్‌ఎస్‌ఈ కార్యకలాపాలు ప్రారంభమైన 14ఏళ్ల తదుపరి ఇన్వెస్టర్ల సంఖ్య కోటికి చేరింది. తదుపరి కోటిమంది ఏడేళ్లలో జత కలవగా.. ఆపై మూడున్నరేళ్లలోనే ఈ సంఖ్యకు మరో కోటి జమయ్యింది. ఈ బాటలో ఆపై.. ఏడాదికి అటూఇటుగా మరో కోటిమంది జత కలిసినట్లు ఎన్‌ఎస్‌ఈ వివరించింది. వెరసి ఎన్‌ఎస్‌ఈ ఆవిర్భవించిన 25ఏళ్లకు అంటే 2021 మార్చికల్లా ఇన్వెస్టర్ల (Stock market investors) సంఖ్య 4 కోట్ల మైలురాయిని తాకింది. ఆపై వేగం పెరిగి 6–7 నెలల్లోనే మరో కోటి మంది ఇన్వెస్టర్లు తోడయ్యారు.

ఈ స్పీడుకు ప్రధానంగా డిజిటైజేషన్, ఫిన్‌టెక్‌ సేవల అందుబాటు, మధ్యతరగతి పెరగడం, ప్రభుత్వ పాలసీల మద్దతు సహకరించాయి. 2025 సెపె్టంబర్‌ 23కల్లా ఎన్‌ఎస్‌ఈలో రిజిస్టరైన ఇన్వెస్టర్ల సంఖ్య 23.5 కోట్లకు చేరింది. అన్ని రకాల క్లయింట్‌ రిజిస్ట్రేషన్లతో కలిపి ఈ సంఖ్యకాగా.. క్లయింట్లు ఒక సభ్యునికంటే అధికంగా కూడా రిజిస్టరయ్యేందుకు వీలుంది.

రిజిస్టర్డ్‌ ఇన్వెస్టర్లలో 12 కోట్లమంది సగటు వయసు 33 ఏళ్లుకాగా.. 1.9 కోట్లమంది ఇన్వెస్టర్లతో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలుస్తోంది. 1.4 కోట్లమంది రిజిస్టర్డ్‌ ఇన్వెస్టర్లరీత్యా ఉత్తరప్రదేశ్‌ రెండో ర్యాంకును పొందగా, 1.03 కోట్లతో గుజరాత్‌ తదుపరి స్థానాన్ని ఆక్రమించింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)