Breaking News

ఒకేసారి 13 కొత్త కాంట్రాక్టులు.. ఎన్‌ఎస్‌ఈ

Published on Tue, 10/17/2023 - 07:50

న్యూఢిల్లీ: కమోడిటీ డెరివేటివ్స్‌లో మరింత విస్తరించే దిశగా ఎన్‌ఎస్‌ఈ కొత్త కాంట్రాక్టులను జోడిస్తోంది. సోమవారం ఒకేసారి 13 నూతన కాంట్రాక్టులను ప్రారంభించినట్టు ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. కమోడిటీ డెరివేటివ్స్‌లో ఎన్‌ఎస్‌ఈ ఆఫర్‌ చేస్తున్న ఉత్పత్తుల సంఖ్య 28కి చేరింది. 

గోల్డ్‌ 1కేజీ ఫ్యూచర్స్, గోల్డ్‌ మినీ ఫ్యూచర్స్, సిల్వర్‌ మినీ ఫ్యూచర్స్, కాపర్‌ ఫ్యూచర్స్, జింక్‌ ఫ్యూచర్స్, గోల్డ్‌ గినియా (8గ్రాములు) ఫ్యూచర్స్, అల్యూమినియం ఫ్యూచర్స్, అల్యూమినియం మినీ ఫ్యూచర్స్, లెడ్‌ ఫ్యచర్స్, లెడ్‌ మినీ ఫ్యూచర్స్, నికెల్‌ ఫ్యూచర్స్, జింక్‌ ఫ్యూచర్స్, జింక్‌ మినీ ఫ్యూచర్స్‌లో ‘ఆప్షన్‌ ఆన్‌ ఫ్యూచర్స్‌’ను ఎన్‌ఎస్‌ఈ తాజాగా ప్రారంభించింది. ఇంధనం, బులియన్, బేస్‌ మెటల్స్‌లో అన్ని ఉత్పత్తులకు సంబంధించి ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ అందిస్తున్నట్టు ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. 

దీంతో ఇన్వెస్టర్లు కమోడిటీ మార్కెట్లో రిస్క్‌ను సమర్థవంతంగా హెడ్జ్‌ చేసుకోవచ్చని ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ శ్రీరామ్‌ కృష్ణన్‌ తెలిపారు. గత కొన్ని రోజుల్లో ఎన్‌ఎన్‌ఈ క్రూడ్‌ ఆయిల్, నేచురల్‌ గ్యాస్, సిల్వర్‌కు సంబంధించి ఆరు నూతన డెరివేటివ్‌ కాంట్రాక్టులను ప్రారంభించడం గమనార్హం. నూతన ఉత్పత్తుల ఆవిష్కరణతో ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరుగుతున్నట్టు ఎన్‌ఎస్‌ఈ తెలిపింది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)