Breaking News

ఇన్వెస్టర్లూ.. జాగ్రత్త! స్టాక్‌ ఎక్స్ఛేంజీల హెచ్చరికలు

Published on Sat, 07/12/2025 - 20:43

ఆన్‌లైన్‌ బాండ్‌ ప్లాట్‌ఫామ్స్‌ ప్రొవైడర్లపట్ల అప్రమత్తత అవసరమని స్టాక్‌ ఎక్స్ఛేంజీ దిగ్గజాలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ తాజాగా ఇన్వెస్టర్లను హెచ్చరించాయి. ఇటీవల ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌ వెలుగులో నిలుస్తున్న నేపథ్యంలో ఎక్స్ఛేంజీల హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వీటి ద్వారా వివిధ రకాల నిర్ధారిత ఆదాయ బాండ్ల (ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌) కొనుగోలు సులభతరమవుతున్న కారణంగా జాగ్రత్త వహించమని తెలియజేశాయి.

వీటి ద్వారా పెట్టుబడులు చేపట్టేముందు పలు కీలక అంశాలను పరిశీలించవలసి ఉన్నదంటూ రెండు ఎక్స్ఛేంజీలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. బాండ్ల క్రెడిట్‌ రేటింగ్, తిరిగి చెల్లింపుల్లో బాండ్ల జారీదారుల ట్రాక్‌ రికార్డ్, బాండ్ల లిక్విడిటీ, సెటిల్‌మెంట్‌ గడువు, పన్ను ప్రభావం తదితర పలు అంశాలను పరిగణించమంటూ సూచించాయి.

ప్రధానంగా బాండ్‌ పాల్ట్‌ఫామ్‌.. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద రిజిస్టరైనదీ లేనిదీ తప్పనిసరిగా పరిశీలించవలసి ఉన్నట్లు తెలియజేశాయి. నిజానికి క్రెడిట్‌ రేటింగ్‌ ఆధారంగా బాండ్లలో పెట్టుబడులపై రిసు్కలు, రిటర్నులు నమోదవుతాయని వివరించాయి.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)