Breaking News

ఏఐ ఎతిహాద్‌ పేమెంట్స్‌తో ఎన్‌పీసీఐ ఒప్పందం

Published on Thu, 10/05/2023 - 10:18

న్యూఢిల్లీ: నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) అనుబంధ సంస్థ అయిన ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్‌ పేమెంట్స్, ఏఐ ఎతిహాద్‌ పేమెంట్స్‌తో ఒప్పందం చేసుకోనుంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆధ్వర్యంలోని బృందం ఈ నెల 5, 6 తేదీల్లో అబుదాబిలో పర్యటించనుంది. ఈ సందర్భంగా ఈ ఒప్పందంపై ఇరువైపులా సంతకాలు చేయనున్నారు.

ఈ ఒప్పందంతో సీమాంతర చెల్లింపులకు వీలు కలుగనుంది. పెట్టుబడులకు సంబంధించి భారత్‌–యూఏఈ 11వ అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ సమావేశానికి మంత్రి పీయూష్‌ గోయల్‌ సహాధ్యక్షత వహించనున్నారు. అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ ఎండీ షేక్‌ హమీద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ సైతం సహాధ్యక్షత వహిస్తారు. ముబదాలా ఎండీ, సీఈవో ఖల్దూన్‌ అల్‌ ముబారక్‌తో మంత్రి గోయల్‌ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు.

యూఏఈ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్, ఇరుదేశాలకు చెందిన వ్యాపారవేత్తలతోనూ సమావేశం కానున్నారు. ఇరు దేశాల్లో మరో దేశం పెట్టుబడులకు సంబంధించి ఎదురయ్యే సవాళ్లు, ఇతర అంశాలపై రెండు దేశాలు చర్చించనున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు జాయింట్‌ టాస్క్‌ఫోర్స్‌ రూపంలో సాధించిన పురోగతిని సమీక్షించనున్నట్టు పేర్కొంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి మంత్రి పీయూష్‌ గోయల్‌ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ద్వైపాక్షిక వాణిజ్యం ప్రోత్సాహానికి వీలుగా రెండు దేశాల మధ్య 2013లో జాయింట్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు కావడం గమనార్హం.

#

Tags : 1

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)