వీసా,మాస్టర్‌కార్డ్‌తో సమానంగా రూపే కార్డు: మోదీ సర్కార్‌ సరికొత్త ప్లాన్‌ 

Published on Mon, 05/15/2023 - 11:35

న్యూఢిల్లీ: రూపే డెబిట్‌ కార్డులకు అంతర్జాతీయంగా ఆమోదయోగ్యతను మరింతగా పెంచడంపై నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) దృష్టి పెడుతోంది. వీసా, మాస్టర్‌ కార్డ్‌లను ఉపయోగించే వారితో సమానంగా రూపే కార్డుదారులకు కూడా ప్రయోజనాలు ఉండేలా చూసేందుకు ఎన్‌పీసీఐ ప్రయత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా మరిన్ని అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు వివరించాయి. (స్వీట్‌ కపుల్‌ సక్సెస్‌ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు)

ప్రస్తుతం అమెరికాకు చెందిన డిస్కవర్, డైనర్స్‌ క్లబ్‌.. జపాన్‌కు చెందిన జేసీబీ, పల్స్‌.. చైనాకు చెందిన యూనియన్‌ పే సంస్థలకు సంబంధించిన పాయింట్స్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌) మెషిన్ల ద్వారా రూపే కార్డులతో లావాదేవీలు నిర్వహించ డానికి వీలుంటోంది. రూపే జేసీబీ గ్లోబల్‌ కార్డును జేసీబీ కార్డు చెల్లుబాటయ్యే ఇతర దేశాల్లోని పీవోఎస్‌లు, ఏటీఎంలలోనూ ఉపయోగించవచ్చు. రూపే డెబిట్‌ కార్డులు, చిన్న మొత్తాల్లో లావాదేవీలకు ఉపయోగపడే ఏకీకృత చెల్లింపుల విధానం.. భీమ్‌-యూపీఐని ప్రోత్సహించేందుకు కేంద్రం రూ. 2,600 కోట్లతో ప్రత్యేక స్కీమును ఈ మధ్యే ఆమోదించింది.  (కేంద్రం గుడ్‌ న్యూస్‌: మొబైల్‌ పోతే..మే 17 నుంచి కొత్త విధానం)

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)