Breaking News

కొత్త స్కామ్.. రూటు మార్చిన కేటుగాళ్లు

Published on Sat, 11/16/2024 - 15:31

టెక్నాలజీని ఉపయోగించుకుని స్కామర్లు కొత్త ఎత్తులతో అమాయకులను మోసం చేస్తున్నారు. ఇప్పటికే ఫేక్ జాబ్ ఆఫర్స్ పేరుతో, స్టాక్ మార్కెట్ స్కీమ్ పేరుతో, డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బంధువుల పేరుతో మోసాలు చేయడానికి సిద్దమైపోతున్నారు. దీనికి సంబంధించిన కేసులు కూడా వెలుగులోకి వస్తున్నాయి.

గుర్తు తెలియని వ్యక్తులు మన ఫోన్ నెంబర్, ఇతర వివరాలను కనుక్కుని.. బంధువుల మాదిరిగా ఫోన్ చేసి చాలా మర్యాదగా, బాగా తెలిసిన వ్యక్తుల మాదిరిగానే ప్రవర్తిస్తారు. తాము కష్టాల్లో ఉన్నామంటూ డబ్బు బదిలీ చేయాలని, లేదా మీ నాన్న నాకు కొంత మొత్తంలో డబ్బు ఇవ్వాలి.. నిన్ను అడిగి తీసుకోమన్నారని, అందుకే నెంబర్ కూడా ఇచ్చారని నమ్మిస్తారు. ఇది నమ్మి డబ్బు బదిలీ చేశారో మీరు తప్పకుండా మోసపోయినట్టే.

ఇదీ చదవండి: వారం రోజుల్లో రూ.9.54 కోట్లు మాయం: ఏం జరిగిందంటే..

ఈ స్కామ్ నుంచి బయటపడటం ఎలా?

  • మీకు ఫోన్ చేసిన వ్యక్తి నిజంగానే మీ బంధువా? లేదా తెలిసిన వ్యక్తా? అని ముందుగానే ద్రువీకరించుకోవాలి.

  • స్కామర్ ఎప్పుడూ మిమ్మల్ని తొందర పెడుతూ.. మీకు ఆలోచించుకునే సమయాన్ని కూడా ఇవ్వకుండా చేస్తాడు, కాబట్టి మీరు ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

  • మీకు తెలియని వ్యక్తులతో.. ఆర్థిక విషయాలను లేదా వ్యక్తిగత విషయాలను చర్చించకూడదు. ఎదుటి వారి మాటల్లో ఏ మాత్రం అనుమానం కలిగినా వెంటనే కాల్ కట్ చేయడం ఉత్తమం.

  • జరుగుతున్న మోసాలను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటం మంచిది. ఆ విషయాలను తెలిసిన వాళ్లకు చెబుతూ.. వాళ్ళను కూడా హెచ్చరిస్తూ ఉండటం శ్రేయస్కరం.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)