Breaking News

ఎన్నారైలకూ సమన్లు వస్తాయ్‌..

Published on Mon, 09/16/2024 - 07:28

మొదలైంది.. ఎన్నారైలకు నోటీసుల పరంపర!! ఎన్నారైలకు విదేశాల్లో ఉన్న ఆస్తుల గురించి, ఆదాయం గురించి.. ఆదాయపు స్టేటస్‌ గురించి.. ఆదాయపు పన్ను వారి ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ నుంచి నోటీసులు మొదలయ్యాయి. మీకూ తెలిసే ఉంటుంది. పన్ను భారం విధించడానికి ప్రమాణం.. మీ రెసిడెంట్‌ స్టేటస్‌. అంతేకాని ఎటువంటి సందర్భంలో పౌరసత్వంతో సంబంధం లేదు.

ఒక వ్యక్తి భారతదేశంలో 182 రోజులు లేదా ఎక్కువ రోజులు నివాసం ఉంటే రెసిడెంట్‌ అవుతారు లేదా ఆర్థిక సంవత్సరంలో 60 రోజులు ఉండి, గత నాలుగు సంవత్సరాల్లో 365 రోజులున్నా రెసిడెంట్లు అవుతారు. మిగతా వారందరూ నాన్‌–రెసిడెంట్లు అవుతారు. స్థూలంగా చెప్పాలంటే పన్ను విధింపు, లెక్కింపు మొదలైన విషయాల్లో రెసిడెంట్లకు, నాన్‌–రెసిడెంట్లకు ఎన్నో తేడాలున్నాయి. నోటీసులో ఏయే అంశాలు అడుగుతున్నారంటే..

  • విదేశాలకు ఎప్పుడు వెళ్లారు?

  • ఏ సంవత్సరంలో విదేశాల్లో బ్యాంకు అకౌంటు తెరిచారు? 

  • ఆ అకౌంటు వివరాలు 

  • ఆ రోజు నుంచి రెసిడెంట్‌ స్టేటస్‌ 

  • పాస్‌పోర్ట్‌లో రాక/పోకకి సంబంధించి ఎంట్రీలు 

  • బ్యాంకు అకౌంటు ఎటువంటిదైనా వివరాలు ఇవ్వాలి 

  • స్థిరాస్తి వివరాలు 

  • ఆదాయ వివరాలు 

  • పన్ను చెల్లింపు వివరాలు 

  • సంబంధిత వివరాలు

విదేశీ సంస్థల ద్వారా సమాచారం తెలుసుకుని వారికి నోటీసులు.. అవసరమైతే సమన్లు ఇస్తున్నారు. నలభై సంవత్సరాల చరిత్ర అడుగుతున్నారని కొందరు వాపోతున్నారు. ఇది అసమంజసం అని అర్జీ పెట్టుకుంటే ఆ అర్జీని కొట్టేస్తున్నారని అంటున్నారు. చట్టప్రకారం ఒకప్పుడు 16 సంవత్సరాలుగా ఉన్న కాలపరిమితిని 10 సంవత్సరాలకు తగ్గించారు. ఆ పదిని 5 సంవత్సరాలకు తగ్గించారు. ఈ కాలపరిమితిని అనుసరించి విదేశీ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కేవలం ఎన్నారైలు కానివారి దగ్గర్నుంచి.. అంటే రెసిడెంట్లు దగ్గర్నుంచి అడుగుతారు.

నాన్‌–రెసిడెంట్లు .. వారున్న దేశం – అంటే విదేశంలోని ఆస్తుల వివరాలు ఇవ్వనవసరం లేదు. ఎటువంటి బాధ్యత లేదు. మరయితే ఎవరిపైన ఈ అస్త్రాలు అంటే.. ‘‘రెసిడెంట్‌ స్టేటస్‌లో ఉంటూ నాన్‌–రెసిడెంట్లుగా చలామణీ అవుతున్న’’ వారి మీద. మనం వాడుక భాషలో విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారిని ‘ఎన్నారై’లు అనేస్తాం.  కానీ, చట్టప్రకారం స్టేటస్‌ లెక్కించాలి. అనుమానం వస్తే నోటీసుల ఇస్తారు. సమాచారం అడుగుతారు. ఇవ్వకపోతే పెనాల్టీ వేస్తారు. మీరు కోర్టులను ఆశ్రయించవచ్చు. డిపార్ట్‌మెంట్‌ వారు బ్లాక్‌మనీ చట్టానికి సంబంధించిన అధికార్లకు రిఫర్‌ చేయొచ్చు. వారు వారి పని చేస్తారు.  

ఎలా బయట పడాలి? 
విదేశాల్లో ఉద్యోగం నిమిత్తం/చదువు కోసం వెళ్లినవారు విధిగా అన్ని రికార్డులు నిర్వహించండి. వీలుంటే ఫ్లైట్‌ టికెట్లు, బోర్డింగ్‌ పాస్‌లు, సంబంధిత ఈమెయిల్స్, పాస్‌పోర్టులు, పాతవి, లేటెస్టువి, వీసాకు సంబంధించిన కాగితాలు, విదేశాల్లో చేసిన ఇన్వెస్ట్‌మెంట్లు, ఏ తేదీ నాడు ఎంతెంత చేశారు.. ఏమి కొన్నారు .. స్థిరాస్తులు, మొదలైనవి రెడీగా ఉంచండి. అడిగినప్పుడు సకాలంలో ఇవ్వండి. నిజాయితీగా. ఆలస్యం అవుతుందంటే ఆ విషయం చెప్పండి. గడువు తేదీ లోపల స్పందించండి.

మీరు నిజంగానే నాన్‌–రెసిడెంట్‌ అయితే, మీరు భయపడక్కర్లేదు. ఎవరినీ భయపెట్టడం లేదు. ముందు నుంచి మనం చెప్పేది ఒకటే. మీరు చేసే ఏ వ్యవహారానికైనా డాక్యుమెంట్లు తప్పనిసరి!!

#

Tags : 1

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)