Breaking News

ఉచితాలతో పేదరికం పోదు 

Published on Thu, 03/13/2025 - 05:31

ముంబై: ఉచిత పథకాలతో కాకుండా ఉద్యోగాల కల్పనతోనే పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు వినూత్న వ్యాపారాలను సృష్టించి, ఉద్యోగాలు కల్పిస్తే పేదరికం ఇట్టే మాయమైపోగలదని ఆయన చెప్పారు. టైకాన్‌ ముంబై 2025 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మూర్తి ఈ విషయాలు తెలిపారు. 

ఎంట్రప్రెన్యూర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ‘మీలో ప్రతి ఒక్కరు వందలు, వేల కొద్దీ ఉద్యోగాలను కల్పించగలరనడంలో నాకెలాంటి సందేహం లేదు. పేదరిక సమస్యను ఆ విధంగానే పరిష్కరించగలం. ప్రపంచంలో ఏ దేశమూ ఉచితాలివ్వడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించిన దాఖలాల్లేవు’ అని తెలిపారు. కొన్ని ఉచితాలు ఇచ్చినా వాటికి బదులుగా నిర్దిష్ట ప్రయోజనాలను రాబట్టే విధంగా అవి ఉండాలని పేర్కొన్నారు. 

ఉదాహరణకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తే, ఓ ఆరు నెలలు పోయాక ఆ ఇళ్లలోని పిల్లలు మరింత శ్రద్ధగా చదువుకుంటున్నారా, పిల్లలపై తల్లిదండ్రుల ఆసక్తి మరింత పెరిగిందాలాంటి అంశాలపై ప్రభుత్వం ఓ సర్వేలాంటిది చేయడం ద్వారా సదరు పథకం ప్రయోజనాలను మదింపు చేయొచ్చని మూర్తి చెప్పారు. మరోవైపు, రాజకీయాలు లేదా గవర్నెన్స్‌ గురించి తనకు పెద్దగా తెలియదని, కేవలం విధానాలపరంగా తీసుకోతగిన చర్యలను మాత్రమే సూచించానని ఆయన వివరణ ఇచ్చారు.   

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు