Breaking News

‘నేనేం పారిపోలేదు.. న్యాయ బంధనాల్లో చిక్కుకున్నా’

Published on Wed, 09/09/2026 - 09:03

కింగ్‌ఫిషర్‌ మాజీ అధినేత విజయ్‌ మాల్యా మరోసారి వార్తల్లో వచ్చారు. తనను ‘పారిపోయిన అప్పులవాడు’ (బగోడా)గా ముద్ర వేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను 1992 నుంచే బ్రిటన్‌లో శాశ్వత నివాసిగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం చట్టపరమైన ఆంక్షల వల్లే యూకే వదిలి రాలేకపోతున్నానని ఎక్స్‌ వేదికగా వరుస పోస్టుల ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం తనకు ఘోరమైన అన్యాయం చేసిందని ఆరోపించారు.

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి గత ఏడాది అక్టోబర్‌లో లోక్‌సభలో ఫ్యుజిటివ్‌ ఎకనామిక్‌ అఫెండర్స్‌ యాక్ట్‌-2018 కింద 15 మందిని ఆర్థిక నేరగాళ్లుగా ప్రకటించినట్టు, అందులో మాల్యా, నీరవ్‌ మోదీ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నట్టు వెల్లడించారు. అయితే, ఇప్పుడు మాల్యా మాత్రం ‘నేను తప్పించుకుని తిరగడం లేదు, న్యాయపరమైన బంధనాలే నన్ను ఆపుతున్నాయి’ అంటూ కొత్త వాదన తెరపైకి తెచ్చారు.

ఇది కేవలం మాటల యుద్ధంతో ఆగిపోలేదు. బ్యాంకులు, ప్రభుత్వం తన నుంచి కోర్టు తీర్పు ప్రకారం రావాల్సిన రూ.6,203 కోట్లకు గాను రూ.14,100 కోట్లు వసూలు చేసినట్టు అంగీకరించారని మాల్యా చెప్పారు. అయినా తనను మోసగాడిగా చిత్రీకరించడం అన్యాయం అన్నారు. తనకు రావాల్సిన రిఫండ్‌ సంగతేమిటని ఎదురుదాడికి దిగారు. ఇక ఫిబ్రవరిలో బాంబే హైకోర్టు మాత్రం.. కోర్టు విచారణలకు దూరంగా ఉంటూ న్యాయమైన ఉపశమనం కోరడం భావ్యం కాదు అని మాల్యాను తీవ్రంగా మందలించింది. చివరిసారిగా భారత్‌ తిరిగొచ్చే ఉద్దేశం ఉందో లేదో స్పష్టం చేయాలని ఆదేశించింది.

ఇదీ చదవండి: నాలుగు ఎకరాలు భూమి కొన్న సచిన్‌.. ధర ఎంతంటే..

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)